పక్కా ప్లానింగ్ తోనే మాస్ జాతర..?

రవితేజలోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ ఈ సినిమా చేస్తున్నారట.;

Update: 2025-03-02 03:00 GMT

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ మూవీస్ నిర్మిస్తున్నారు. ధమాకా తర్వాత రవితేజ భారీ స్థాయిలో సినిమాలు చేశాడు కానీ ఏ ఒక్కటి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఐతే మాస్ జాతర మాత్రం మిస్ కాలిక్యులేషన్ అయ్యే ఛాన్సే లేదని అంటున్నారు. రవితేజలోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ ఈ సినిమా చేస్తున్నారట.

మాస్ రాజా ఫ్యాన్స్ కి నిజంగానే మాస్ జాతర ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. రవితేజ ఫ్యాన్స్ ఈమధ్య మిస్ అవుతున్న కామెడీ, మాస్ మిక్స్ చేసి ఈ మాస్ జాతర సినిమాలో పెడుతున్నారట. అందుకే ఈ సినిమా టార్గెట్ చాలా పెద్దదిగా ఉంటుందని అంటున్నారు. అదీగాక ధమాకాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో నటిస్తుంది కాబట్టి ఆమెకు కూడా సినిమాకు కలిసి వచ్చేలా ఉంది.

మాస్ మహారాజ్ రవితేజ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ సినిమా చేసే వసూళ్ల హంగామా తెలిసిందే. అందుకే మాస్ జాతర మేకర్స్ సినిమా అన్ని యాస్పెక్ట్స్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా చూస్తున్నారట. సినిమా రష్ చూసే సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ అనేలా మాట్లాడుకుంటున్నారు. ఐతే సితార బ్యానర్ సినిమా నుంచి ఈమధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా అదరగొడుతున్నాయి.

వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మాస్ జాతర మస్త్ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ఇంకా మాస్ ఆడియన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. మాస్ జాతర నుంచి ఈమధ్య వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా ఇదే స్టఫ్ సినిమాలో ఉంటే మాత్రం ఫ్యాన్స్ కోరుతున్న హిట్ సాధించినట్టే లెక్క అని చెప్పొచ్చు. ఇంతకీ మాస్ జాతర టైటిల్ కి తగినట్టుగానే రిలీజైన థియేటర్ల దగ్గర జాతర ఏర్పడేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.

ఈ సినిమా మీద రవితేజ కూడా ఫుల్ ఫోకస్ తో ఉన్నారని తెలుస్తుంది. సినిమా అన్ని విధాలుగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేందుకు మాస్ రాజా కూడా కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ మాస్ జాతర మాస్ రాజా ఫ్యాన్స్ ఆకలి తీర్చుతుందా లేదా అన్నది చూడాలి. సినిమాను సమ్మర్ రేసులో దించాలనే ప్లాన్ లో ఉండగా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

Tags:    

Similar News