ఒకే కారులో వెళ్తే భార్యాభ‌ర్త‌లంటారా?

అంబిక వికీపీడియాలో సైతం ఈ అప్ డేట్ ఉంది. అయితే ఈ ప్ర‌చారంపై ర‌వికాంత్ స్పందించారు. 'నేను అంబిక భ‌ర్త‌నంటూ ప్ర‌చారం చేస్తున్నారు.

Update: 2024-07-22 03:45 GMT

సీనియ‌ర్ న‌టి రాధిక సోద‌రి అంబిక సుప‌రిచిత‌మే. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో అనేక సినిమాలు చేసారు. 'దొంగ‌లు బాబోయ్ దొంగలు', 'మా నాన్న‌కు పెళ్లి', 'రాయుడు', 'నేటి గాంధీ', 'కొండ‌వీటి సింహం' లాంటి సినిమాలు చేసారు. ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటూ సీరియ‌ళ్లు చేస్తున్నారు. అయితే అంబిక‌ వ్య‌క్తిగ‌త జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారంలో ఉంది.

1988 లో ఎన్నారై ప్రేమ్ కుమార్ ని వివాహం చేసుకోగా.. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో 1996లో విడిపోయారు. అనంత‌రం 2000 లో న‌టుడు ర‌వికాంత్ ని వివాహం చేసుకున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారంలో ఉంది. అంబిక వికీపీడియాలో సైతం ఈ అప్ డేట్ ఉంది. అయితే ఈ ప్ర‌చారంపై ర‌వికాంత్ స్పందించారు. 'నేను అంబిక భ‌ర్త‌నంటూ ప్ర‌చారం చేస్తున్నారు.

ఇద్ద‌రు చాలా సినిమాల్లో భార్య‌భ‌ర్త‌లుగా న‌టించాం. అంత‌మాత్రానా నిజ జీవితంలో భార్య‌భ‌ర్త‌ల బంధానికి అంట‌గ‌డ‌తారా? ఇద్ద‌రు ప‌క్క ప‌క్క ఇళ్ల‌లోనే ఉంటాం. రెండు కార్లు ఎందుకంటే ఒకే కారులో షూటింగ్ కి వెళ్తుంటాం. భార్యాభ‌ర్త‌లు క‌లిసి వ‌స్తున్నారంటూ స‌ర‌దాగా ఆట ప‌ట్టిస్తారు. అంత‌వరకే మా రిలేష‌న్. మేము నిజ‌మైన భార్యాభ‌ర్త‌లం కాదు. ప్రేమ్ కుమార్ ని వివాహం చేసుకున్నాక అంబిక అమెరికాలో ఉండేది.

షూటింగ్స్ కోసం వ‌చ్చి వెళ్లేది. అంత‌కు మించి ఆమె గురించి ఇత‌ర వివ‌రాలేవి తెలియ‌దు. కానీ భార్యాభ ర్త‌లంటూ ప్ర‌చారం మాత్రం జ‌నాల్లో కి బ‌లంగా వెళ్లిపోయింది. దీన్ని ఇంత‌కాలం ప‌ట్టించుకోక‌పోవ‌డం అన్న‌ది నా త‌ప్పుగానే భావిస్తున్నా. ఇప్ప‌టికైనా నిజం గ్ర‌హించాల‌ని కోరుకుంటున్నా' అని అన్నారు. ర‌వికాంత్ త‌మిళ్ లో స‌రోజ‌, బిర్యానీ, అభిమాన్యు, మానాడులాంటి సినిమాల్లో న‌టించారు.

Tags:    

Similar News