బాలయ్య డాకు మహారాజ్ కోసం మాస్ మహారాజ్..!

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో కె ఎస్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్.

Update: 2024-12-08 15:37 GMT

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో కె ఎస్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతెల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఈమధ్యనే డాకు మహారాజ్ నుంచి ఒక టీజర్ వచ్చింది. బాలకృష్ణను నిప్పురవ్వ తర్వాత ఆ రేంజ్ లో చూపించబోతున్నాడు బాబీ.

2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి ఒక లీక్ వచ్చింది. బాలయ్య సినిమాకు మాస్ మహారాజ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని టాక్. సినిమాలో బాలకృష్ణ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ రవితేజ వాయిస్ ఓవర్ ఉంటుందని తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. సితార బ్యానర్ లో రవితేజ సినిమాలు చేస్తున్నారు. అందుకే బాలకృష్ణ సినిమాకు వాయిస్ ఓవర్ అనగానే ముందుకొస్తున్నారు.

స్టార్ హీరోల సినిమాల్లో వేరే హీరోల వాయిస్ ఓవర్ చాలా కామన్. ఇదివరకు మహేష్, ఎన్ టీ ఆర్, రవితేజ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు డాకు మహారాజ్ కోసం రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇదే నిజమైతే డాకు మహారాజ్ మాస్ రాజా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. డాకు మహారాజ్ సినిమా యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. సినిమాకు యాక్షన్ సీన్స్ కు తగినట్టుగానే థమన్ బిజిఎం అదరగొట్టేస్తాడని తెలుస్తుంది.

ఈమధ్య బాలయ్య వరుస సూపర్ హిట్లు కొడుతున్నాడు. యువ హీరోలకు ధీటుగా క్రేజీ హిట్లు అందుకుంటున్నాడు. భగవంత్ కేసరి తర్వాత బాబీ తో చేస్తున్న డాకు మహారాజ్ తో కూడా భారీ టార్గెట్ ని పెట్టుకున్నాడు బాలయ్య. సంక్రాంతికి గేం ఛేంజర్ సినిమా క్లాస్ యాక్షన్ గా వస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వస్తున్నాం వస్తుంది. ఊర మాస్ కంటెంట్ తో బాలయ్య డాకు మహారాజ్ వస్తుంది. మరి ఈ సినిమాల ఫైట్ లో ఏ సినిమా సక్సెస్ అందుకుంటుందో చూడాలి.సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకంగా అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News