రవితేజకు 100 కోట్ల పవర్ ఉన్నా..

మంచి కథతో సినిమా చేస్తే 100 కోట్లు అందుకోవడం పెద్ద కష్టం కాదని ధమాకా లాంటి మూవీస్ ప్రూవ్ చేశాయి.

Update: 2024-08-18 05:36 GMT

టాలీవుడ్ లో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తోన్న స్టార్ యాక్టర్ అంటే మాస్ మహారాజ్ రవితేజ పేరు వినిపిస్తోంది. ఏడాదికి రెండు సినిమాలని రవితేజ ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. కొత్త దర్శకులకి కూడా మాస్ మహారాజ్ అవకాశాలు ఇస్తున్నాడు. అయితే ఆయన కథల ఎంపికలో ఎందుకనో ఈ మధ్య కాస్త పెర్ఫెక్షన్ తగ్గిందనే మాట వినిపిస్తోంది. గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే రవితేజ నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు వస్తున్నాయి.

అయితే వాటిలో కమర్షియల్ సక్సెస్ లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. యాక్టర్ గా రవితేజ తాను చేస్తోన్న ప్రతి సినిమాలో క్యారెక్టర్ కి 100 శాతం న్యాయం చేస్తున్నాడు. అయితే దర్శకులు మాత్రం రవితేజ టాలెంట్ ని ఉపయోగించుకొని ప్రేక్షకులని మెప్పించే కథలు చెప్పడంలో విఫలం అవుతున్నారనే మాట వినిపిస్తోంది. ఈ ప్రభావం వలన రవితేజకి వరుస ఫ్లాప్ లు పడుతున్నాయని అభిమానులు అంటున్నారు. రవితేజతో సినిమా అంటే ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు.

మంచి కథతో సినిమా చేస్తే 100 కోట్లు అందుకోవడం పెద్ద కష్టం కాదని ధమాకా లాంటి మూవీస్ ప్రూవ్ చేశాయి. ఆయనతో సినిమా అంటే 50 కోట్ల వరకు బడ్జెట్ రెడీ చేసుకోవాలనే టాక్ నడుస్తోంది. కానీ రవితేజ పైన థీయాట్రికల్ బిజినెస్ మాత్రం 30 నుంచి 40 కోట్ల మధ్యలోనే జరుగుతోంది. అయితే నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుండటంతో 50 కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు.

గత ఏడాది నుంచి ఇప్పటి వరకు రవితేజ నుంచి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రావణాసురకి 50 కోట్ల బడ్జెట్ అయితే కేవలం 23.1 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీకి కూడా 50 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా లాంగ్ రన్ లో 48 కోట్ల గ్రాస్ మాత్రమే వసూళ్లు చేసింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ మూవీకి 35 కోట్ల పెట్టుబడి పెట్టగా కేవలం 30.85 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

ఈ చిత్రం హెవీగానే థీయాట్రికల్ లాస్ అందించింది. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ కోసం 40 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసారంట. ఈ చిత్రానికి కూడా టాక్ పాజిటివ్ గా రాకపోవడంతో ఇప్పటికే పబ్లిక్ అటెన్షన్ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ లెక్కన చూసుకుంటే రవితేజపై 35-50 కోట్ల బడ్జెట్ లు పెడుతున్న రిటర్స్ రావడం లేదనే మాట వినిపిస్తోంది. అయితే సమస్య దర్శకులు కథలు చెప్పడంలో ఉందా లేదంటే రవితేజ స్టోరీ సెలక్షన్ లో ఉందా అనేది చూసుకోవాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News