రవితేజ 'ఈగల్'.. టికెట్ రేట్లు ఎంతంటే?

మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ తెలంగాణలో సాధారణ టికెట్ రేట్లతోనే ఉండబోతున్నట్లు సమాచారం.

Update: 2024-02-06 08:46 GMT

స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెరుగుతాయనే విషయం తెలిసిందే. అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాతలు రిలీజ్ టైం లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇరు ప్రభుత్వాలని కోరడం.. ప్రభుత్వాలు కూడా అందుకు అంగీకరించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ టికెట్ రేట్ల పెంపు సామాన్య ఆడియన్స్ కి ఇబ్బందిని కలిగిస్తుంది.

అంత రేటు పెట్టి సినిమా చూడకుండా కొంతమంది ఆడియన్స్ థియేటర్స్ కూడా వెళ్ళని పరిస్థితి ఇటీవల కాలంలో కనిపిస్తూనే ఉంది. అయితే మాస్ మహారాజా రవితేజ మాత్రం తన కొత్త సినిమా విషయంలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న 'ఈగల్' మూవీ ఈ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ తెలంగాణలో సాధారణ టికెట్ రేట్లతోనే ఉండబోతున్నట్లు సమాచారం. సింగిల్ స్క్రీన్స్ లో రూ.150 వరకు, మల్టీప్లెక్స్ లలో రూ.200గా ఈగల్ మూవీ టికెట్ రేట్స్ అందుబాటులో ఉండనున్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా సినిమాకి సాధారణ టికెట్ రేట్ నే ఫిక్స్ చేశారు.

ఈగల్ సినిమాకి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు ఈ వీకెండ్ మరి పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో ఈగల్ కంటెంట్ ఆడియన్స్ కి ఏ మాత్రం క్లిక్కయినా హౌస్ ఫుల్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నిజానికి ఈగల్ సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారు. అలా అని టికెట్ రేట్లు పెంచకుండా సాధారణ టికెట్ రేట్స్ తోనే ఆడియన్స్ అందరూ థియేటర్లో సినిమాని చూసే వీలు కల్పించడం విశేషమనే చెప్పాలి.

కాగా ఈగల్ సినిమాని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. సీనియర్ నటి మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్, కోలీవుడ్ యాక్టర్ వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

Tags:    

Similar News