మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ షేక్ చేయడం గ్యారెంటీ

అందులో భాగంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు.

Update: 2024-07-05 11:41 GMT

మాస్ మహారాజ్ రవితేజ ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడట. అస్సలు గ్యాప్ తీసుకోకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గత ఏడాది చివరిగా ఈగల్ మూవీతో రవితేజ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఈ సారి కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో మాస్ మహారాజ్ ఉన్నారు. అందులో భాగంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హిందీ మూవీ రేస్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అవుతోంది. మిక్కీ జె మియర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో షాక్, మిరపకాయ్ మూవీస్ తెరకెక్కాయి.

మిరపకాయ్ సూపర్ హిట్ అయ్యింది. తరువాత మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేయాలని చాలా సార్లు ప్రయత్నం చేసిన వర్క్ అవుట్ కాలేదు. అయితే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్న సమయంలో గ్యాప్ రావడంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో రైటర్ బీవీఎస్ రవి చలపతి అనే పాత్రలో నటించారు. ఆయన పాత్రకి సంబందించిన డబ్బింగ్ తాజాగా పూర్తి చేసారంట.

Read more!

బీవీఎస్ రవి తాజాగా ట్విట్టర్ లో ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టారు. మిస్టర్ బచ్చన్ సినిమాలో లో తనకి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నా క్యారెక్టర్ కి సంబంధించి డబ్బింగ్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. కచ్చితంగా మిస్టర్ బచ్చన్ మూవీ కచ్చితంగా బాక్సాఫీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే మూవీ అవుతుందని బీవీఎస్ రవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఇదిలా ఉంటే త్వరలో మిస్టర్ బచ్చన్ సినిమా సాంగ్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నట్లు వీడియో టీజర్ ద్వారా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. హరీష్ శంకర్ మూవీ కావడంతో మిస్టర్ బచ్చన్ పై పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఈ సినిమాలో రవితేజలోని ఒకప్పటి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ మరోసారి చూస్తారని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది.

Tags:    

Similar News

eac