క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఆర్సీ 16!

దాదాపు 20 రోజుల పాటు నైట్ షూట్ గ్యాప్ లేకుండా ఉంటుంద‌ని యూనిట్ రివీల్ చేసింది. ఇప్ప‌టికే కొన్ని రోజులు గా నైట్ షూట్ జ‌రుగుతోంది.

Update: 2025-02-09 11:37 GMT

#ఆర్సీ 16 షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌రుగు తోంది. ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటుంది. ఇదీ స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ స్టోరీ అని ఇప్ప‌టికే లీకైంది. ఆ క‌థ గ్రామీణ నేప‌థ్యంలో సాగుతుంద‌ని వినిపిస్తుంది. అయితే ఆ క్రీడ ఏంటి? అన్న‌ది ఇంత వ‌ర‌కూ క్లారిటీ రాలేదు. క‌బ‌డ్డీ, కోకో ఆట అంటూ ప్ర‌చారం జ‌రిగింది గానీ, వాటిని యూనిట్ ధృవీక‌రించ‌లేదు. ఖండించ‌లేదు.

దీంతో సినిమాలో ఆడే ఆట‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఈ క్రీడ విష‌యంలో నెట్టింట పెద్ద డిబేట్ కూడా న‌డిచింది. ఈ నేప‌థ్యంలో తాజాగా క్రీడ‌పై క్లారిటీ వ‌చ్చేసింది. ఈ క‌థ క్రికెట్ ఆట‌తో ముడిప‌డి ఉన్న క‌థ‌గా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఛాయాగ్రాహ‌కుడు ర‌త్నవేలు చేసిన ట్వీట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.సెట్స్ లో ని క్రికేట్ స్డేడియం ప్ల‌డ్ లైట్ల ఫోటోల‌ను పంచుకున్నారు. దానికి నైట్ షూట్..ప్ల‌డ్ లైట్స్..క్రికెట్ ప‌వ‌ర్...డిఫ‌రెంట్ యాంగిల్స్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు.

దీంతో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని తేలిపోయింది. ఇటీవ‌లే నైట్ షూట్ జ‌రుగుతుందని మేక‌ర్స్ ప్ర‌క‌టిం చిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 20 రోజుల పాటు నైట్ షూట్ గ్యాప్ లేకుండా ఉంటుంద‌ని యూనిట్ రివీల్ చేసింది. ఇప్ప‌టికే కొన్ని రోజులు గా నైట్ షూట్ జ‌రుగుతోంది. రాత్రి వేళ క్రికెట్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు చిత్రీ క‌రిస్తున్నారు. సినిమాకివి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని టీమ్ ధీమా వ్య‌క్తం చేస్తోంది.

మ‌రి ఈ ఆట‌తో బుచ్చిబాబే ఎంత‌గా ర‌క్తి క‌ట్టిస్తాడో చూడాలి. క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీలు టాలీవుడ్ కి కొత్తేం కాదు. ఇప్ప‌టికే చాలా సినిమాలొచ్చాయి. వాటిలో కొన్ని బ‌యోపిక్ లు కూడా ఉన్నాయి. కొన్ని స‌క్సెస్ అయ్యాయి. కొన్ని పెయిల‌య్యాయి. అయితే బుచ్చి బాబు సినిమా వాటికి కాస్త భిన్నంగా ఉంటుంది. క్రికెట్ నేప‌థ్యాన్ని ఓ బేస్ పాయింట్ గా మాత్ర‌మే తీసుకుకుని ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Tags:    

Similar News