RC16: బుచ్చిబాబు ప్లాన్ ఎలా ఉందంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ RC16 షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ RC16 షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ కూడా సినీప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా చరణ్ కెరీర్‌లో మరో బిగ్ హిట్ గా నిలవనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాగా, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ మరింత ఉత్కంఠ రేపుతోంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈరోజు రాత్రి RC16 షూటింగ్ పనులు మరింత వేగంగా సాగనున్నాయు. బృందం నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఇప్పటికే కొన్ని అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశారు, ఇప్పుడు మరింత వేగంగా షూటింగ్‌ను పూర్తి చేయాలని బుచ్చిబాబు టీమ్ సంకల్పించింది. ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ కొత్త లుక్, కథన తీరుపై చాలా ఆసక్తికరమైన అంచనాలు ఉన్నాయి.
దర్శకుడు బుచ్చిబాబు తన గత సినిమా ఉప్పెనతో అద్భుతమైన ఎమోషనల్ కనెక్షన్ చూపించిన విషయం తెలిసిందే. ఇక RC16 కోసం మరింత గొప్ప స్క్రిప్ట్ సిద్ధం చేశాడని సమాచారం. సినిమాకు సంబంధించిన వర్క్ మొత్తం కూడా ఆగస్టు లోపు పూర్తిగా ఫినిష్ చేసి, సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ మీద చరణ్ కూడా చాలా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ముందుగా ఫిక్స్ చేసిన ప్లాన్ ప్రకారం షెడ్యూల్స్ కు ఎటువంటి ఆటంకం లేకుండా షూటింగ్ జరగాలనే నిశ్చయంతో టీమ్ పని చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే, సినిమా అందరి అంచనాలను మించిపోతుందని అంటున్నారు.
ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ 3 ట్యూన్స్ ఇచ్చినట్లు సమాచారం. రెహమాన్ స్టైలిష్ మ్యూజిక్, గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయనే నమ్మకంతో చిత్రబృందం ముందుకు వెళ్తోంది. సినిమా కథ కూడా పూర్తిగా కొత్తగా ఉండబోతుందని సమాచారం. చరణ్ కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన మూవీ అవుతుందని, కథలో మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా సమపాళ్లలో ఉంటాయని అంటున్నారు.
ఇది రామ్ చరణ్ కోసం ఎంతో స్పెషల్ ప్రాజెక్ట్ అనే విషయం తెలిసిందే. RRR తర్వాత ఆయన చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ అత్యున్నత ప్రమాణాలతో ఉంటుండటంతో అభిమానులు కూడా భారీ అంచనాలు పెంచుకున్నారు. ఈ సారి దీపావళికి బాక్సాఫీస్ దగ్గర మాస్ దుమ్ములేపే సినిమా ఇదే కానుంది. షూటింగ్ వేగంగా సాగుతోన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ వెలువడే అవకాశముంది. మరి బుచ్చిబాబు టీమ్ సినిమాను అనుకున్న ప్లాన్ ప్రకారం విడుదల చేస్తుందో లేదో చూడాలి.