RC16: అనుకున్నట్టే ఆయన రంగంలోకి..
తాజాగా ఈ మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఆర్‌సీ16 సినిమా దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‍లో రానున్న చిత్రంపై క్రేజ్ విపరీతంగా ఉంది. తన తొలి సినిమా ఉప్పెనతోనే భారీ బ్లాక్ బాస్టర్ కొట్టడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డును బుచ్చిబాబు దక్కించుకున్నారు. రెండో సినిమాలోనే రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్‍కు ఇది 16వ చిత్రం.
తాజాగా ఈ మూవీ మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఆర్‌సీ16 సినిమా దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నేడు (జనవరి 6) రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ ఇచ్చింది.
"మొజార్ట్ ఆఫ్ మద్రాస్, అకాడమీ అవార్డ్ విన్నింగ్ ఏఆర్ రెహమాన్ ను ఈ మూవీలోకి ఆహ్వానిస్తున్నాం. హ్యాపీ బర్త్ డే. ఈ లెజెండ్ వల్ల ఆర్‌సీ16లో మ్యూజిక్ స్కోర్ అద్భుతంగా ఉంటుంది" అని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. బర్త్ డే విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
అయితే ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తారని చాలారోజులుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మూవీ యూనిట్ అఫీషియల్ గా వెల్లడించింది. సాధారణంగా సుకుమార్ లేదా ఆయన శిష్యులు ఎక్కువ శాతం దేవిశ్రీ ప్రసాద్ నే సెలెక్ట్ చేసుకుంటారు. బుచ్చిబాబు తొలి సినిమాలో కూడా డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఈసారి బుచ్చిబాబు రూటు మార్చి రెహమాన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. రెమ్యునరేషన్ కూడా హై రేంజ్ లోనే ఇస్తున్నట్లు టాక్.
స్పోర్ట్ బ్యాక్ డ్రాప్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఆర్‌సీ16 సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు మూవీని నిర్మిస్తున్నాయి. యూనివర్సల్‍గా అప్పీల్ ఉండే పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను బుచ్చిబాబు రాసుకున్నారట. ఈ సినిమా షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్‍లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే గేమ్ ఛేంజర్ రిలీజ్ అవ్వనుందని నిర్మాత దిల్ రాజు ఇటీవలే చెప్పారు.