నిజ ఘటనలతో గేమ్ ఛేంజర్?
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన శ్రద్ధ అంతా శంకర్ సినిమాపైనే ఉంచిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన శ్రద్ధ అంతా శంకర్ సినిమాపైనే ఉంచిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ కోసం అతడు ఏడాదిన్నర కాలంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందుతోంది.
ఈ సినిమా కథాంశం ఏమిటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అభిమానుల్లో అంతకంతకు పెరుగుతోంది. ఇందులో చరణ్ కలెక్టర్ గా కనిపిస్తారని, ఐఏఎస్ టర్న్ డ్ సీఎంగా మారే యువకుడిగా చరణ్ నటిస్తున్నాడని టాక్ వినిపించింది. బహుశా నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందించిన కథాంశం ఇదని ఊహాగానాలు సాగుతున్నాయి. 2023లో చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆవిష్కరించినా కానీ సినిమా కథాంశం గురించిన అప్‌డేట్‌లు ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
రకరకాల కారణాలతో ప్రాజెక్ట్ జాప్యాలు.. చిత్రీకరణలో అనిశ్చితి ఉన్నా కానీ.. చిత్ర బృందం సినిమా విజయంపై నమ్మకంగా ఉంది. కథాబలంపై టీమ్ కి నమ్మకం ఉంది .. సినిమా ఔట్ పుట్ ఇతర విషయాలపై సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ కి శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ పని చేస్తున్నారు. ఇది క్యూరియస్ ఎలిమెంట్. అతడు సమాజంలోని రుగ్మతలపై యుద్ధం చేసే, సామాజిక ఆందోళనలను పరిష్కరించే భావోద్వేగాలతో కూడిన కథలను రూపొందించడంలో నిపుణుడు. గేమ్ ఛేంజర్ లో కంటెంట్ దీనికి ఏమాత్రం తీసిపోదు. జెంటిల్‌మేన్, ఒకే ఒక్కడు తర్వాత మళ్లీ అదే జానర్ లో భారీతనం నిండిన ప్రత్యేకమైన సినిమా ఇదని అంచనా వేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ కథాంశం ఏమిటి? అంటే.. ఇది భారతదేశంలో ఎన్నికల వ్యవస్థను మార్చడానికి ఎలాంటి మార్పులు తేవాలి? అనే పాయింట్ ని ఇందులో చర్చిస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియల సంక్లిష్టతలను, ఓటింగ్ ఫలితాలను ప్రభావితం చేయడానికి ఓటర్లను తారుమారు చేసే ప్రయత్నాలపైనా ఈ సినిమా అవగాహన పెంచుతుంది. ఇది నేటి ప్రపంచంలో అత్యంత సందర్భోచితమైన అంశం.
ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. 1990లలో భారీ సంస్కరణలను అమలులోకి తెచ్చిన మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్ TN శేషన్ జీవితం ఈ చిత్రానికి ప్రేరణ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. శేషన్ సృజనాత్మక ఆలోచనల ఫలితంగా భారతీయ ఎన్నికలు విప్లవాత్మక మార్పులకు లోనయ్యాయి. ఎన్నికల విధానాలను మార్చిన అతని పదవీ కాలం ఆధారంగా `గేమ్ ఛేంజర్` కథాంశాన్ని రాసుకున్నారని, నాటి ముఖ్య సంఘటనలను కథాంశంలో హైలైట్ చేస్తున్నారని సమాచారం. స్టోరీ కాన్సెప్ట్‌ను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందించారు.
`గేమ్ ఛేంజర్` ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు.