ఏడాది గ్యాప్ ఇందుకేనా సమంత!
అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటుందని భావించిన సమంత సోషల్ మీడియా ఖాతాల్లో ఎడా పెడా ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఉదయాన్నే లేచి ముస్తాబై అమెరికా వీధుల్లో షికార్లు చేస్తోంది.
'ఖుషీ' సినిమా షూటింగ్ అనంతరం సమంత ఏడాది పాటు విరామం తీసుకుంటానని..ఎలాంటి సినిమాలు చేయబోనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనతో అభిమానులు నిరాశపడ్డారు. 'ఖుషీ' రిలీజ్ అయిన తర్వాత సమంతని మళ్లీ ఏడాది వరకూ చూడలేమని వాపోయారు. అన్నినెలలు పాటు సామ్ ని తెరపై చూడకుండా ఉండగలమా? అని మదన పడ్డారు. అమ్మడు అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఏడాది వరకూ కనిపించదని..విరామం అంది కాబట్టి హోటల్స్.. గెస్ట్ హౌస్ లకు మాత్రమే పరిమవు తుందని భావించారు.
మళ్లీ 2024 లోనే సమంత కనిపించేదని అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు. ఎలాగూ వెళ్లిపోతుంది కదా? వెళ్తూ వెళ్తూ ఖుషీ వేడుకలో మరోసారి విజయ్ తో డాన్స్ చేసిందని అందరూ ఖుషీ అయ్యారు. అనుకున్నట్లే సమంత ఖుషీ ప్రీ రిలీజ్ అనంతరం అమెరికా వెళ్లిపోయింది. దీంతో సమంత కనిపించదని మైండ్ ని బ్లైండ్ గా ఫిక్స్ చేసారంతా. కానీ కట్ చేస్తే అమ్మడు అమెరికాలో ఉన్నా? పక్కనే ఉన్నట్లు టచ్ లో ఉంటుంది.
అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటుందని భావించిన సమంత సోషల్ మీడియా ఖాతాల్లో ఎడా పెడా ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఉదయాన్నే లేచి ముస్తాబై అమెరికా వీధుల్లో షికార్లు చేస్తోంది. అక్కడి అందాలు ఆస్వాదిస్తూ ఆమూవ్ మెంట్స్ ని అభిమానులతో పంచుకుంటుంది. మునుపెన్నడు చేయని కొత్త పనులు.. ఎంతో స్వేచ్ఛ తో విహరిస్తుంది. వీటిని రెగ్యులర్ గా ఫాలో అవుతోన్న ఓ సెక్షన్ ఆడియన్స్ సమంతపై గుసాయింపుకు దిగారు.
ఇదేంటి సమంత విశ్రాంతి కోసం అమెరికాకి వెళ్లి...అక్కడ వీధుల్లో విహరిస్తుంది? ఆమె వెళ్లింది వెకేషన్ కా? విశ్రాంతి కా? అంటూ ట్రోలర్స్ కూడా సీన్ లోకి వచ్చేస్తున్నారు. ఆమాత్రం దానికి విరామం దేనికి..అలాంటి ప్రకటన ఇవ్వడం ఎందుకు? వెకేషన్ కి వెళ్తున్నా? అంటే సరిపోద్దుగా అంటున్నారు. ఇంత కాలం షూటింగ్ కారణంగా అలిసిసొలసిన అమ్మడు ఇప్పుడిలా ఎంజాయ్ చేయడం చేసి కొంత మంది కళ్లు కుట్టినట్లు కనిపిస్తుంది.