స‌ల్మాన్ భాజీరావు అయితే న‌టించ‌లేన‌న్న ఐష్

ఐశ్వర్య రాయ్ బచ్చన్ 'భాజీరావ్ మస్తానీ'లో మస్తానీ పాత్రను పోషించడానికి ఆసక్తిగానే ఉంది. అయితే బాజీరావుగా ఎంపికైన‌ సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకోన‌ని షరతు విధించింది.

Update: 2023-09-12 01:59 GMT

క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన 'భాజీరావ్ మ‌స్తానీ' బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ణ‌వీర్ సింగ్- దీపిక ప‌దుకొనే జంట‌గా న‌టించారు. నిజానికి ఆ ఇద్ద‌రి స్థానంలో తొలిగా స‌ల్మాన్ ఖాన్- ఐశ్వ‌ర్యారాయ్ ల‌ను ఈ ఆఫ‌ర్ వ‌రించింది. భ‌న్సాలీ స్వ‌యంగా ఆ ఇద్ద‌రినీ ఎంపిక చేసుకున్నారు. కానీ కాలం క‌లిసి రాలేదు. ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌లేదు. స‌ల్మాన్ - ఐష్ జంట న‌డుమ అప్ప‌టికే ర‌క‌ర‌కాల గొడ‌వ‌లు త‌లెత్త‌డంతో జంట‌గా న‌టింప‌జేయ‌డంలో భ‌న్సాలీ విఫ‌ల‌మ‌య్యారు.

ఐశ్వర్యరాయ్ బచ్చన్ - సల్మాన్ ఖాన్ స్థానంలో చివ‌రికి విధి 'దీపికా పదుకొనే - రణవీర్ సింగ్‌'లను నియ‌మించింది. వారితో సినిమా చేయాలని నిర్ణయించింది. అయితే SLB బాజీరావ్ మస్తానీ నుండి ఐశ్వర్య బయటకు వెళ్లిన త‌ర్వాతే ఈ ప‌రిణామం ఎదురైంది. ఈ ఘ‌ట‌న‌ జ‌రిగిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఐష్ ఇప్ప‌టికి దానిపై మాట్లాడింది. బాజీరావ్ అయిన సల్మాన్‌తో పని చేయకూడదని భావించిన విష‌యాన్ని పరోక్షంగా వెల్లడించింది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ 'భాజీరావ్ మస్తానీ'లో మస్తానీ పాత్రను పోషించడానికి ఆసక్తిగానే ఉంది. అయితే బాజీరావుగా ఎంపికైన‌ సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకోన‌ని షరతు విధించింది. అత‌డి స్థానంలో వేరొక హీరోని ఎంపిక చేయాల‌ని కూడా సూచించింది. తాజా ఇంటర్వ్యూలో ఐష్ మాట్లాడుతూ.. నిజానికి మస్తానీగా న‌టించేందుకు సంతోషంగా ఉన్నాన‌ని, కానీ భన్సాలీ బాజీరావుతో కాదు అని ఐష్ పేర్కొంది. ఐశ్వర్య బాజీరావ్ మస్తానీ నుండి బయటికి వెళ్లిందని ఆ త‌ర్వాత‌ తేలింది.

ఐష్ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాక కత్రినా కైఫ్‌ను స‌ల్మాన్ భాయ్ స్వ‌యంగా సంజయ్ లీలా భ‌న్సాలీ కార్యాలయానికి తీసుకెళ్లి ఈమెనే మీ మస్తానీ అని చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే భ‌న్సాలీ క‌త్రిన‌ను ఒప్పించలేదు. ఐశ్వర్య-సల్మాన్ జోడీ కుదరకపోవడంతో, కత్రినా కైఫ్‌ను మస్తానీగా నటింపజేయాలని స‌ల్మాన్ కోరుకున్నా కానీ దానికి అతడు ఓకే చేయ‌లేద‌ని కూడా తెలిసింది.

సల్మాన్ ఖాన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ల మధ్య అప్ప‌టికే బోలెడ‌న్ని స‌మ‌స్య‌లున్నాయి. త‌న‌ను శారీర‌కంగా హింసించాడ‌ని స‌ల్మాన్ పై ఐష్ తీవ్ర‌ ఆరోపణలు చేసింది. అత‌డు తిట్టి కొట్టేవాడ‌ని కూడా ఆరోపించింది. అప్పటి నుండి సల్మాన్- ఐశ్వర్య రాయ్ జంట‌గా న‌టించ‌లేదు. పరిశ్రమలో సంవత్సరాల తరబడి ఉన్నప్పటికీ ఒక‌రినొక‌రు క‌లుసుకోవ‌డం కానీ, ముఖాముఖి ఎదుర‌వ్వ‌డం కానీ జ‌ర‌గ‌లేదు. ఇద్ద‌రూ ఎల్లప్పుడూ ఒక‌రికొక‌రు దూరంగా ఉన్నారు.

Tags:    

Similar News