నేను సీరియ‌ల్ డేట‌ర్‌ని.. చాలామంది బోయ్ ఫ్రెండ్స్ ఉన్నారు: రెజీనా

ప్ర‌వీణ్ స‌త్తారు `రొటీన్ ల‌వ్ స్టోరి` సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన చెన్నై భామ రెజీనా క‌సాండ్రా.. ఆ త‌ర్వాత టాలీవుడ్ కోలీవుడ్ లో చాలా చిత్రాల్లో న‌టించింది.

Update: 2024-09-13 09:26 GMT

ప్ర‌వీణ్ స‌త్తారు `రొటీన్ ల‌వ్ స్టోరి` సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన చెన్నై భామ రెజీనా క‌సాండ్రా.. ఆ త‌ర్వాత టాలీవుడ్ కోలీవుడ్ లో చాలా చిత్రాల్లో న‌టించింది. కానీ స్టార్ డ‌మ్ మాత్రం అందుకోలేక‌పోయింది. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో చాలా యాక్టివ్‌గా ఉన్న రెజీనా ఇటీవ‌ల‌ పూర్తిగా స్లో అయ్యింది. గత ఐదు సంవత్సరాలుగా కేవలం నాలుగు తెలుగు చిత్రాలలో మాత్ర‌మే కనిపించింది.

ఎవరు, తలైవి, సాకిని డాకిని చిత్రాల‌తో పాటు `ఆచార్య`లో ఒక ప్ర‌త్యేక‌ పాటలో కనిపించింది. అయితే ఇప్పుడు `ఉత్సవం` సినిమాతో మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార ఇంటర్వ్యూలలో రెజీనా తన నిజ జీవిత సంబంధాల గురించి వెల్లడించింది. క‌ప‌ట‌త్వం అంటే ఏమిటో తెలియ‌ని అమ్మాయిగా రెజీనాకు పేరుంది. త‌న డేటింగుల విష‌యంలోను దాప‌రికం లేకుండా దానిని ప్రూవ్ చేసింది.

రెజీనాను విలేక‌రులు వ్యక్తిగత జీవితం గురించి ప్ర‌శ్నించ‌గా.. తాను `సీరియల్ డేటర్` అని వ్యాఖ్యానించింది. ప‌లువురితో డేటింగులు చేసాన‌ని అంగీక‌రించింది. ప్రస్తుతానికి డేటింగ్ నుండి విరామం తీసుకున్నాన‌ని చెప్పింది. ఏం చేయాలో చెప్పడానికి ఇష్టపడని `హైపర్-ఇండిపెండెంట్` మహిళగా తనను తాను అభివర్ణించుకుంది. రెజీనా తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌లలో ఒకరి తల్లిదండ్రులు తన ఫిల్టర్ లెస్ మాట‌ల‌కు ఆశ్చర్యపోయారని కూడా తెలిపింది. యువ‌హీరో సందీప్ కిషన్‌తో తనకు ఉన్న స్నేహం గురించి ఈ సంద‌ర్భంగా ఓపెనైంది. మేమిద్ద‌రం `టామ్ అండ్ జెర్రీ` టైప్‌. కేవలం మంచి స్నేహితులు మాత్రమే.. మేం ఎప్పుడూ డేటింగ్ చేయ‌లేదు అని చెప్పింది.

Tags:    

Similar News