దర్శకేంద్రుడితో రేణుదేశాయ్ ఫ్యాన్ మూవ్మెంట్
టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో కలిసి ఫుల్ ఫ్యాన్ మూవ్ మెంట్ ని రేణు షేర్ చేసారు.
టాలీవుడ్ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. గత వారం, రేణు దేశాయ్ ఒక వీడియో పోస్ట్ లో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై వెబ్ సిరీస్ తీయడంపైనా.. రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించారు.
తమ పిల్లలను వివాదాల్లోకి లాగవద్దని ఆమె కోరారు. పవన్ వల్ల వ్యక్తిగతంగా బాధపడ్డ మాట వాస్తవమే.. ఆ క్షణం కదిలిపోయాను కానీ.. వ్యక్తిగత జీవితం పక్కన పెడితే.. సమాజానికి అతడు మేలు చేస్తాడనే నమ్మకం నాకుంది.. అని రేణు తన మాజీకి మద్ధతు పలికారు.
అదంతా అటుంచితే రేణు సోషల్ మీడియాల్లో చాలా విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను షేర్ చేస్తుంటారు. తను మాట్లాడాలనుకున్న విషయాన్ని ముక్కు సూటిగా మాట్లాడటం తన ప్రత్యేకత. మరోవైపు రేణు దేశాయ్ తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో కలిసి ఫుల్ ఫ్యాన్ మూవ్ మెంట్ ని రేణు షేర్ చేసారు. ఆసక్తికరంగా ఈ ఫోటో తీసింది ఎవరు? అంటే.. రేణు వారసుడు అకీరానందన్.
ఆ విషయాన్ని ఈ ఫోటోపై కూడా రేణు వెల్లడించారు. రాఘవేంద్రరావు ఈ ఫోటోగ్రాప్ లో వైట్ అండ్ వైట్ లుక్ లో కనిపించారు. మెడలో రుద్రాక్షలతో ఆయనలోని ఆధ్యాత్మిక చింతన బహిర్గతమైంది. మరోవైపు రేణు దేశాయ్ పింక్ శారీలో ఎంతో ప్రత్యేకంగా కనిపించారు. ప్రస్తుతం అంతర్జాలంలో ఈ ఫోటోగ్రాఫ్ వైరల్ గా మారుతోంది.
రేణు దేశాయ్ కెరీర్ పునరాగమనం విషయానికి వస్తే.. దాదాపు 18 ఏళ్ల తర్వాత రేణు మళ్లీ తెరపైకి వస్తోంది. రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో భారతీయ సామాజిక కార్యకర్త, రచయిత్రి హేమలత లవణం నిజ జీవిత పాత్రను పోషిస్తోంది. 70వ దశకం నాటి కరడుగట్టిన దొంగపై బయోపిక్ తీయాలనే దర్శకుడి విజన్ రీసెర్చ్ తనకు నచ్చిందని అందుకే ఈ పాత్రలో నటించేందుకు అంగీకరించానని రేణు వెల్లడించారు.