ఖుషి మ్యూజిక్ కన్సర్ట్.. సమంత ఎనర్జీకి కారణమిదే
స్టేజ్ పైనే లైవ్ పర్ఫార్మెన్స్, ఎనర్జటిక్ డ్యాన్స్ అంతా అభిమానుల కోసమే చేసిందని కానీ.. ఆమె ఇంకా అనారోగ్యంగానే ఉందని అర్థమవుతోంది.
సోషల్ మీడియాలో ఇప్పుడంతా సమంత పేరే ట్రెండింగ్ అవుతోంది. అందుకు కారణం.. ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్ ఆమె చేసిన ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్. కొంతకాలంగా వరుస వైఫల్యాలు, సినిమాలకు బ్రేక్, మయోసైటిస్ వంటి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఈ ఈవెంట్లో మాత్రం ఎంతో ఎనర్జటిక్ గా, ఛార్మింగ్ లుక్ తో కనిపించి ఆకట్టుకుంది.
ఆమె డ్రెస్సింగ్ స్టైల్, లుక్స్, విజయ్ దేవరకొండతో డ్యాన్స్, స్పీచ్.. అన్నీ ఈ ఈవెంట్ కు హైలైట్ గా నిలిచాయి. అసలీ ఈవెంట్ కోసం ఆమె గంటల వ్యవధిలో మూడు కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేసి మరీ సర్ ప్రైజ్ చేసింది. మొదట బ్లాక్ బ్రాలెట్ లో సందడి చేసిన సమంత.. తర్వాత స్టేజ్ పై లైవ్ పర్ఫార్మెన్స్ కోసం లెహెంగాలో కనిపించి ఆకట్టుకుంది. అనంతరం మెరూన్ కలర్ స్లీవ్ లెస్ చీరలో మెస్మరైంజిగ్ గా కనిపించి ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
అయితే మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లుగా కాస్త డల్ గా, సైలెంట్ గా కనిపించిన ఆమె.. ఈ ఈవెంట్ లో ఆమె ఎలా కనిపిస్తుందో, తన ఆరోగ్యం ఎలా ఉందో అని అభిమానులు కాస్త టెన్షన్ పడ్డారు. కానీ ఈ మధ్య ఆమె కాస్త బ్రేక్ తీసుకొని ఆధ్యాత్మిక యాత్రలు, ప్రకృతిలో విహరిస్తూ లైఫ్ ను లీడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో ఆమె పెరఫార్మెన్స్ చూశాక.. ఆ బ్రేక్ వల్ల ఆమె ఆరోగ్యం కాస్త గాడిలో పడినట్టుందని అనుకుంటున్నారు.
కానీ ఎంత ఇలా అనుకున్న.. ఆ ఉత్సాహం, స్టేజ్ పైనే లైవ్ పర్ఫార్మెన్స్, ఎనర్జటిక్ డ్యాన్స్ అంతా అభిమానుల కోసమే చేసిందని కానీ.. ఆమె ఇంకా అనారోగ్యంగానే ఉందని అర్థమవుతోంది. ఆమె మాటల్లోనే ఇది తెలుస్తోంది. ఈవెంట్ చివర్లో అభిమానుల అరుపులు, కేకలు చూసిన సంతోషపడిపోయిన ఆమె.. మీ కోసమే హార్డ్ వర్క్ చేస్తున్నాను త్వరలోనే తిరిగొస్తా గట్టి బ్లాక్ బస్టర్ కొడతాను అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది.
దీంతో అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంగా తయారవ్వాలని ప్రార్థిస్తున్నారు. బాగోలేనప్పటికీ అభిమానుల కోసం సమంత చూపిన ఎనర్జీ చూసి ప్రశంసిస్తున్నారు. సమంత సంకల్పం, ఆత్మవిశ్వాసం, బలమే.. ఆమెను ఇలా ధైర్యంగా ఉండేలా చేస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.