స‌లార్ స్నేహానికి సీఎం సార్ ఫిదా..అందుకే ఇలా!

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో జ‌రిగిన భారీ బహిరంగ సభకి హాజ‌రైన సీఎం రేవంత్‌ రెడ్డి కి అక్కడ ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

Update: 2023-12-30 11:21 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన 'స‌లార్' ఇండియాని షేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఊచ కోత కొస్తుంది. ఇప్ప‌టికే 500 కోట్ల క్ల‌బ్ లో చేరిన 'స‌లార్ సీజ్ పైర్' ఇంకెన్ని సంచ‌నాలు న‌మోదు చేస్తుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ అయిన అన్నిచోట్లా స‌లార్ మేనియా కొన‌సా గుతుంది. అంత‌కు ముందు యానిమ‌ల్ థియేట‌ర్ల‌ను ఊపేస్తూ ఇప్పుడా వంతు స‌లార్ ది అయింది.

వాస్త‌వానికి మొద‌టి భాగంలో ప్ర‌భాస్ విశ్వ‌రూపం పెద్ద‌గా హైలైట్ కాలేదు. అంతా క‌లిపి రెండవ భాగంలో స‌లార్ ఎలాంటి వింధ్వ‌స‌ప‌రుడో చూపించ‌బోతున్నారు. ఈ బేసిస్ లోనే సినిమా జ‌నాల్లో హైలైట్ అవు తుంది. ఇక సినిమాలో 'సూరిడే గొడుగు ప‌ట్టి' అనే పాట ఎంత‌గా ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు స్నేహితుల బంధాన్ని రివీల్ చేస్తూ ఆ పాట రాయ‌డం..దాన్ని సినిమాల్లో హైలైట్ చేయ‌డం జ‌రిగింది. దేవ‌-వ‌ర‌ద‌ల మ‌ధ్య బాండింగ్ ని ఆ పాట హైలైట్ చేస్తుంది.

సోష‌ల్ మీడియాలో ఆ పాట ట్రెండింగ్ లో నిలిచింది. ఆ పాట‌కి క‌నెక్ట్ కాని అభిమాని అంటూ లేడు. అంతా త‌మ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పాట‌ని త‌మ‌కి కావాల్సిన విధంగా మ‌లుచుకుంటున్నారు. లిరిక్స్ ప్ర‌తీ ఒక్క హృద‌యాన్ని బ‌లంగా దాక‌డంతోనే ఇది సాధ్య‌మ‌వుతుంది. ఈ జాబితాలో రాజ‌కీయ నాయ‌కులు కూడా త‌గ్గ‌లేదు. పార్టీ కార్య‌క‌ర్త‌లు.. లీడ‌ర్లు అంతా ఈ పాట‌ని త‌మ‌కి అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు.

ఈ విష‌యంలో నేను కూడా త‌గ్గేదే లే అంటూ తెలంగాణ రాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా ముందుకు రావ‌డం విశేషం. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో జ‌రిగిన భారీ బహిరంగ సభకి హాజ‌రైన సీఎం రేవంత్‌ రెడ్డి కి అక్కడ ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. దీంతో అక్క‌డ అను బంధం..అలాగే పార్టీ నేత రాహుల్ గాంధీతో త‌న‌కున్న అనుబంధాన్ని తెలియ‌జేస్తూ రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో సూరిడే గొడుగు ప‌ట్టిన పాట ని జ‌త చేసారు. ఆ పాట లిరిక్స్ ని కూడా జోడించారు. దీంతో ఆ పాట‌కి ముఖ్య‌మంత్రి ఎంత‌గా క‌నెక్ట్ అయ్యారో? అర్ద‌మ‌వుతుంది. ఆయ‌న అభిమానుల్ని ఆ వీడియో ఎంత‌గానో మెప్పిస్తుంది.

Tags:    

Similar News