ఆర్జీవీ వ్యూహం ట్రైలర్… ఎలా ఉందంటే!

అక్కడి నుంచి జగన్ ప్రయాణం మొదలవుతుంది. వైఎస్ భారతితో మాట్లాడుతూ బాబు చెప్పిన అబద్ధాలు వారు ఎలక్షన్స్ తర్వాతే తెలుసుకుంటారు అని డైలాగ్ వస్తుంది.

Update: 2023-10-13 10:01 GMT

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ అయిన ఆర్జీవీ ప్రస్తుతం ముఖ్య మంత్రి జగన్ కి అనుకూలంగా వ్యూహం అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. వైఎస్ మరణం తర్వాత జగన్ ని అవినీతి కేసుల్లో అరెస్ట్ చేయడం, ఆ పై బయటకొచ్చి 2019 ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఉన్న ప్రయాణాన్ని వ్యూహంలో సినిమాలో ఆర్జీవీ చూపించబోతున్నారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ట్రైలర్ ఓపెన్ చేయగానే సోనియా గాంధీ ఓదార్పు యాత్ర ఆపమని హెచ్చరిస్తూ ఫోన్ చేస్తుంది. తరువాత చంద్రబాబు ఇప్పుడు నా వ్యూహం మొదలవుతుంది అనే డైలాగ్ చెబుతాడు. అక్కడి నుంచి జగన్ ప్రయాణం మొదలవుతుంది. వైఎస్ భారతితో మాట్లాడుతూ బాబు చెప్పిన అబద్ధాలు వారు ఎలక్షన్స్ తర్వాతే తెలుసుకుంటారు అని డైలాగ్ వస్తుంది.

సీబీఐ అధికారులు తనని ఇన్వెస్టిగేషన్ చేసే సీన్. చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు చర్చించడం, ఆపై జగన్ ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆపై ప్రజాక్షేత్రంలోకి జగన్ వెళ్లి పాదయాత్ర మొదలుపెట్టడం లాంటి ఎలిమెంట్స్ ని ట్రైలర్ లో ఆవిష్కరించారు. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గురించి వైఎ స్ భారతి మాట్లాడుతూ రెండు లక్షల పుస్తకాలు చదివిన అతని ఆలోచన ఆ మాత్రం లేదా అని అంటుంది.

జగన్ ని ఎట్టి పరిస్థితిలో ముఖ్యమంత్రి కానివ్వను అని పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తో డైలాగ్ చెప్పించాడు. అంటే కళ్యాణ్ తోనేనా ఇక సహవాసం అనగానే చంద్రబాబు గాజు గ్లాసు తీసుకొని ఎలక్షన్ అవ్వనివ్వు… ఆ కళ్యాణ్ కి ఎవరు శత్రువో, ఎవరు మిత్రుడో గుర్తించే తెలివి లేదయా అని చెబుతారు. ఫైనల్ గా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో దోచుకున్న సొమ్ము ఎవరి పాకెట్ లోకి వెళ్ళింది అని ముఖ్యమంత్రి హోదాలో జగన్ చెప్పే డైలాగ్ చెప్పించారు.

ఆపై జగన్ నా ముందు పిల్లపి** అంటూ చంద్రబాబు పాత్రతో చెప్పించి ట్రైలర్ ఎండ్ చేశారు. ట్రైలర్ మొత్తం జగన్ హీరోయిజం చూపిస్తూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని విలన్ గా రిప్రజెంట్ చేస్తోనే వ్యూహం ట్రైలర్ ని ఆర్జీవీ ఆవిష్కరించారు. మరి ఈ సినిమా ఏ మేరకు ఆడియన్స్ కి రీచ్ అవుతుందనేది చూడాలి.

Full View
Tags:    

Similar News