భార‌త‌దేశంలో అత్యంత సంప‌న్న‌ గాయ‌కుడు

త‌న మొద‌టి సినిమాకి కేవ‌లం రూపాయ‌లు మాత్ర‌మే అందుకున్న అత‌డు ఇప్పుడు ఏకంగా గంట‌కు కోట్ల‌లో తీసుకునే సంగీత ద‌ర్శ‌కుడిగా, గాయ‌కుడిగా పాపుల‌ర‌య్యారు.

Update: 2025-01-07 04:07 GMT

భారతదేశపు అత్యంత సంపన్న గాయకుడు లేదా సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రు? పోటీ ప్ర‌పంచంలో ఎదురే లేని క్రేజ్ తో నేటికీ అసాధార‌ణ ఆర్జ‌న క‌లిగి ఉన్న ఏకైక గాయ‌కుడు కం సంగీత ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. త‌న మొద‌టి సినిమాకి కేవ‌లం రూపాయ‌లు మాత్ర‌మే అందుకున్న అత‌డు ఇప్పుడు ఏకంగా గంట‌కు కోట్ల‌లో తీసుకునే సంగీత ద‌ర్శ‌కుడిగా, గాయ‌కుడిగా పాపుల‌ర‌య్యారు.


ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. లెజెండ‌రీ ఏ.ఆర్. రెహమాన్. స్వరమాంత్రికుడిగా, గాయకుడిగా విశిష్టమైన కెరీర్‌లో భారీ నిక‌ర‌ ఆస్తుల‌ను సంపాదించిన ప్ర‌ముఖుడు ఏ.ఆర్.రెహ‌మాన్. భారతీయ సినీరంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో రెహ‌మాన్ ఒకరు. సినీసంగీతం.. కచేరీ పర్యటనలు, ఎండార్స్‌మెంట్‌లు.. ర‌క‌ర‌కాల వ్యాపారాల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించాడు. రెహ‌మాన్ నికర ఆస్తుల‌ విలువ భార‌తీయ క‌రెన్సీలో 2320 కోట్లు. రూ.280 మిలియన్ల డాల‌ర్లుగా అంచ‌నా.

ఈరోజు, భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న‌ గాయకుడిగా మారిన 58 ఏళ్ల రెహమాన్ చ‌రిత్ర‌కెక్కారు. ఒకప్పుడు పాట‌కు సంగీతం అందించినందుకు ఫీజుగా కొన్ని రూపాయలు మాత్ర‌మే తీసుకునేవారు. అత‌డి స్వ‌గ‌తాన్ని ప‌రిశీలిస్తే... రెహ‌మాన్ మద్రాసులోని హిందూ కుటుంబంలో జన్మించాడు. అతడి చిన్ననాటి పేరు దిలీప్ కుమార్ రాజగోపాల్. తండ్రి ఆర్.కె. శేఖర్ తమిళ మలయాళ చిత్రాలకు సంగీతం అందించారు. కాబట్టి రెహమాన్ సహజంగానే చిన్నప్పటి నుండి సంగీతం వైపు మొగ్గు చూపాడు. నిజానికి అతడు కేవలం 4 సంవత్సరాల వయస్సులో పియానో వాయించడం నేర్చుకున్నాడు. రెహమాన్ 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తన తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత చదువుతో పాటు కుటుంబ పోషణ కోసం శ్రమించాల్సి వచ్చింది. దీంతో చదువుపై దృష్టి సారించలేక స్కూల్లో ఫెయిల్ అయ్యాడు. సూఫీ గురువు ప‌రిచ‌యంతో అత‌డు ముస్లిమ్ గా మారాడు.

1991 లో సంగీత ప్ర‌పంచంలో అడుగుపెట్టాడు. ఇళ‌య‌రాజా శిష్య‌రికంలో కీబోర్డ్ ఆర్టిస్టుగా ప‌ని చేసాడు. 1993లో మణిరత్నం `రోజా` చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం రెహమాన్ అందుకున్న ఫీజు ఎంతో తెలుసా? కేవ‌లం రూ.25,000 అందుకున్నాడు. ఈ చిత్రం మ్యూజికల్ హిట్ అయ్యాక అత‌డి ప్ర‌యాణం గురంచి తెలిసిందే. రెహ‌మాన్ భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న‌ గాయకుడు. అతడు ఫుల్‌టైమ్ సింగర్ కాదు. పాట పాడి సంగీతం అందించినందుకు 3 కోట్లు తీసుకుంటున్నాడు.

రెహమాన్ రెండు గిన్నిస్ రికార్డులను అందుకున్న ప్ర‌జ్ఞావంతుడు. మొదటిది వందేమాతరం పాట కోసం.. అతను వివిధ భాషలలో పాడాడు. ఒరిజినల్ సాంగ్ కంపోజ్ చేసినందుకు రెండో రికార్డ్ ద‌క్కింది. ప‌ద్మ‌శ్రీ‌, ప‌ద్మ‌భూష‌ణ్ వంటి అత్యున్న‌త పుర‌స్కారాల‌ను అందుకున్న రెహ‌మాన్ 7 జాతీయ అవార్డులు అందుకున్నాడు. స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ కోసం ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్, గ్రామీ స‌హా ఎన్నో అవార్డులు అత‌డి ఖాతాలో ఉన్నాయి.

Tags:    

Similar News