స‌న్యాసినుల‌ను అవ‌మానించిన గాయ‌ని

ప్ర‌ముఖ‌ మ్యాగజైన్ తాజా సంచిక కోసం కవర్-గర్ల్‌గా మారిన గాయని రిమానా సన్యాసినులను 'లైంగికంగా ఆవిష్క‌రించింద‌ని వివాదం చెల‌రేగింది.

Update: 2024-04-11 05:53 GMT

ప్ర‌పంచవ్యాప్తంగా గొప్ప వీరాభిమానుల‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ పాప్ గాయ‌ని రిహ‌న్న ఇటీవ‌లే అంబానీల ప్రీవెడ్డింగ్ వేడుక‌లో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. రిహాన్న రాక‌తో జామ్ న‌గ‌ర్ విమానాశ్ర‌యం జామ్ అయిపోయింది. కేవ‌లం కొన్ని గంట‌ల పాటు ప్ర‌ద‌ర్శ‌న కోసం ఏకంగా 70 కోట్ల పారితోషికం అందుకుంద‌ని కూడా టాక్ వినిపించింది. ప్రీవెడ్డింగ్ లో డ్యాన్స్ షో కోసం రిహ‌న్నా మంది మార్భ‌లంతో పాటు ఏకంగా ఒక చిన్న ఇంటిని మ‌డ‌త‌పెట్టి విమానంలో తెచ్చుకుంద‌ని కుర్ర‌కారు కామెంట్ చేయ‌డం, దానికి రిహాన్న అంతే స‌ర‌సంగా స్పందించ‌డం తెలిసిందే.

 

అదంతా అటుంచితే ఈ హాట్ క్రేజీ సింగ‌ర్ పేరు ఇప్పుడు రాంగ్ రీజ‌న్ తో వార్త‌ల్లోకొచ్చింది. రిహన్నా ఈసారి సన్యాసినిగా వేషం వేసిన ఫోటోషూట్‌ వివాదాన్ని రేకెత్తించింది. సన్యాసిని భంగిమ‌లు క్రిస్టియానిటీలో తీవ్ర‌ ఆగ్రహాన్ని రేకెత్తించాయి. రిహ‌న్న స‌న్యాసిని దుస్తులు ధ‌రించి సమ్మోహన భంగిమలు ప్ర‌ద‌ర్శిస్తూ, ఛాతీ పచ్చబొట్టును బహిర్గతం చేయడానికి ష‌ర్ట్ బ‌ట‌న్‌ని ఓపెన్ చేసింది. ఇది క్రిస్టియ‌న్ ప్ర‌జ‌ల హృద‌యాల‌ను మ‌రిగించింది.

ప్ర‌ముఖ‌ మ్యాగజైన్ తాజా సంచిక కోసం కవర్-గర్ల్‌గా మారిన గాయని రిమానా సన్యాసినులను 'లైంగికంగా ఆవిష్క‌రించింద‌ని వివాదం చెల‌రేగింది. ఈ యాక్ట్ తో మతపరమైన క్రమాన్ని అగౌరవపరిచింద‌ని ప‌లువురు ఆరోపించారు. 36 ఏళ్ల స్టార్ సింగ‌ర్ ఫోటోలు వీడియోల‌పై క్రైస్తవులు కాథలిక్‌లు తీవ్రంగా వ్య‌తిరేకించారు. అభ్యంతరకరమైన ఫోటోలను వీక్షించిన నెటిజ‌నుల నుంచి రిహ‌న్న తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

ఒక నెటిజ‌న్ ఈ ఫోటోషూట్‌ను 'మతపరమైన అపహాస్యం' అని ఖండించారు. మరికొందరు రిహన్న తన ఫ్యాషన్ ఎంపికలతో ''ఒక మతాన్ని వెక్కిరించాల‌ని ఎందుకు భావిస్తున్నారు?'' అని ప్రశ్నించారు. అయితే రిహ‌న్నాను వ్య‌తిరేకించేవారే కాదు.. ఇది త‌ప్పు కాద‌న్న‌వారు లేక‌పోలేదు. రిహాన్నా యాక్ట్ ను హాలోవీన్ కోసం 'స్ల‌టీ సన్యాసినులు' ధరించే దుస్తుల‌ను, వారి ఆహార్యంతో పోలిక చూపెట్టారు. అలాంటి సందర్భాలలో విమర్శలు స‌రికాద‌ని వాదించారు. ఇంతలోనే రిహానా ఫోటోషూట్ పోటి ఫెస్ట్‌ను ప్రేరేపించిందని, చాలా మంది టిక్-టాక్ లో దీనికి అనుస‌ర‌ణ‌గా వారి ఫోటోషూట్ల‌ను షేర్ చేసార‌ని ట్వీట్లు వెల్ల‌డించాయి.

రిహన్న సాంస్కృతికంగాను మతపరమైన సున్నితత్వంపై ప్ర‌ద‌ర్వ‌న‌ల‌తో విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2021లో టాప్‌లెస్ ఫోటోలో హిందూ దేవుడు గణేశుడి లాకెట్టును ధరించినందుకు త‌న‌పై తీవ్ర‌ ఆరోపణలు వచ్చాయి. నాటి సంఘటనలో రిహాన్న తన సావేజ్ x ఫెంటీ లోదుస్తుల ప్రదర్శన సౌండ్‌ట్రాక్‌లో పవిత్ర ఇస్లామిక్ గ్రంథాలను ఉపయోగించినందుకు విమర్శలను ఎదుర్కొంది.

తనవైన‌ ఫ్యాషన్ ఎంపికలతో సరిహద్దులను చెరిపేసే మేటి గాయ‌నిగా రిహన్నాపై ఎన్ని విమ‌ర్శ‌లు ఉన్నా కానీ, నిరంత‌రం గౌర‌వించేవారు లేక‌పోలేదు. MET గాలా 2018లో జాన్ గల్లియానో రూపొందించిన పోప్-ప్రేరేపిత డిజైన‌ర్ దుస్తుల‌ను ధరించి రిహాన్న‌ కనిపించడం వివాదాన్ని రేకెత్తించింది. కొందరు ఈ బ్యూటీ సృజనాత్మకతను కొనియాడారు. మరికొందరు దానిని నిందించారు.. చాలామంది అభ్యంతరకరంగా భావించారు. ఈవెంట్ థీమ్, 'హెవెన్లీ బాడీస్: ఫ్యాషన్ అండ్ ది కాథలిక్ ఇమాజినేషన్' నేపథ్యంలో గాయని వెరైటీ ఆహార్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

Tags:    

Similar News