సైలెంట్ గా ప్లాన్ చేసుకుంటున్న రాబిన్ హుడ్!
ఎనర్జిటిక్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకి కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఎనర్జిటిక్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకి కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నితిన్, వెంకి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతోందని ఇప్పటికే స్పష్టం అయ్యింది. ఇలాంటి కథలతోనే నితిన్ ఎక్కువ సక్సెస్ లు కూడా అందుకున్నారు.
భీష్మ కూడా ఇదే తరహా కథతో వచ్చి హిట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న రాబిన్ హుడ్ లో నితిన్ కి జోడీగా శ్రీలీల నటిస్తోంది. శ్రీలీల క్యారెక్టర్ కూడా మోస్ట్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాబిన్ హుడ్ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఆ సమయంలో అయితే పెద్ద కాంపిటేషన్ ఉండదని నిర్మాతలు భావించి ఈ డిసెంబర్ రిలీజ్ ఫిక్స్ చేసారంట.
అయితే డిసెంబర్ లో పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ లోనే వస్తోంది. అలాగే గేమ్ చేంజర్ కూడా డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాబిన్ హుడ్ చిత్రాన్ని ముందుగా రిలీజ్ చేసే అవకాశాలని నిర్మాతలు పరిశీలిస్తున్నారంట. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అందుబాటులో ఉండటంతో ఆ టైంలో పాజిబుల్ అవుతుందేమో చూస్తున్నారంట.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పెండింగ్ షూటింగ్ కూడా తొందరగా పూర్తి చేసి సరైన డేట్ చూసుకొని రిలీజ్ ఎనౌన్స్ చేయాలని భావిస్తున్నారంట. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. భీష్మ తర్వాత నితిన్ కి మళ్ళీ సక్సెస్ రాలేదు.
దీంతో రాబిన్ హుడ్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు. వెంకి కుడుములు ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు. వరుస ఫెయిల్యూర్స్ మీద ఉన్న శ్రీలీలకి రాబిన్ హుడ్ తో బ్రేక్ రావాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇమేజ్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇక వెంకీ కుడుముల వరుసగా సక్సెల్ లు అందుకున్నప్పటికి మూడవ సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక నెక్స్ట్ రేంజ్ హీరోలతో ఛాన్స్ రావాలి అంటే అతను ఈసారి సాలీడ్ హిట్ అందుకోవాల్సిందే.