దీపావళి పేదరికం గుర్తు చేసుకున్న రోహిత్ శర్మ!
ఇక అంతర్జాతీయ మ్యాచులతోనూ రోహిత్ ఆదాయం భారీగానే ఉంటుంది.
హిట్ మ్యాన్ ఓపెనర్ రోహిత్ శర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోట్లాదిమంది అభిమానించే ఆటగాడు. వీరేంద్ర సెహ్వాగ్ గర్వాత ఆస్థానాన్ని భర్తీ చేసిన ప్లేయర్. మార్కెట్ లో అతడి బ్రాండ్ ఇమేజ్ గురించిచెప్పాల్సిన పనిలేదు. ఒక్కో యాడ్ కి కోట్లలో పారితోషికం అందుకుంటాడు. ఇక అంతర్జాతీయ మ్యాచులతోనూ రోహిత్ ఆదాయం భారీగానే ఉంటుంది. మరి అలాంటి రోహిత్ ఒకప్పుడు ఆర్దిక పరిస్థితుల్నిచూసాడు.
ముఖ్యంగా అతడి బాల్యం ఎంతో పేదరికంతోనే గడిచినట్లు కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా రోహిత్ శర్మ చెప్పిన విషయాలు తెలిస్తే విస్తు పోవాల్సిందే. `చిన్నప్పుడు అర్దిక సమస్యల వల్ల అమ్మ-నాన్నలు అనన్ను మావయ్య ఇంట్లో ఉంచి చదివించారు. దీపావళి వచ్చిందంటే అక్కడ జనాలంతో టపాసులు పోటీ పడి మరీ కాల్చేవారు. నేను ఒకటి రెండు కాల్చేవాడిని. తర్వాత ఇరుగు పొరుగు వారు గంటలు గంటలు కాల్చుతుంటే? చూస్తూ తెగ సంబరపడేవాడిని.
కానీ టపాసుల వల్ల పర్యావరణానికి ఎంతో హాని అని తెలిసాక వాటి జోలికి వెళ్లలేదు. క్రాకర్స్ ని కాల్చే వాళ్లని చూస్తుంటే నవ్వొస్తుంది. మా పాపల్ని అలాంటి వేడుకలకు దూరంగా ఉంచుతున్నా. ఆరోజు ఇంట్లో వాళ్లతో కలిసి లక్ష్మీ పూజ చేసుకోవడం, అందరికీ స్వీట్లు పంచడం నాకు అలవాటు. కానీ క్రికెట్ వల్ల రెండేళ్లగా దీపావళిని విదేశాల్లో హాటల్స్ లోనే జరుపుకోవాల్సి వస్తోంది.
అయినా ఆ సమయంలో కుటుంబ సభ్యులు పక్కనే ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా కాలంగా దీపావళిని అలా స్వాగతించడం అలవాటుగా మారిపోయింది` అని అన్నారు. రోహిత్ శర్మ స్వస్థలం వైజాగ్. కానీ చిన్నప్పుడే తండ్రి ఉద్యోగరీత్యా ముంబై వెళ్లిపోయారు. రోహిత్ శర్మతెలుగు చక్కగా మాట్లాడగలడు.