ఆర్ఆర్ఆర్ షో.. నిమిషంలో హౌస్ ఫుల్

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైనపుడు రాజమౌళి వీకెస్ట్ మూవీస్‌లో ఒకటనే కామెంట్లు వినిపించాయి. ఓవరాల్ టాక్ కొంచెం డివైడ్‌గానే వచ్చింది

Update: 2024-03-14 14:32 GMT

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైనపుడు రాజమౌళి వీకెస్ట్ మూవీస్‌లో ఒకటనే కామెంట్లు వినిపించాయి. ఓవరాల్ టాక్ కొంచెం డివైడ్‌గానే వచ్చింది. కానీ ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు చేసింది. హలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సహా ఎంతోమంది అంతర్జాతీయ సినిమా ప్రముఖులను ఈ చిత్రం కట్టి పడేసింది. ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో దీనికి ప్రశంసలు లభించాయి. అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ను నేటివ్ అమెరికన్స్ ఎగబడి చూశారు. జపాన్‌లో అయితే ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టింది ‘ఆర్ఆర్ఆర్’. వంద రోజుల పాటు ఫుల్ ఆక్యుపెన్సీలతో సినిమా నడిచింది. ఆ తర్వాత కూడా చాన్నాళ్ల పాటు రన్ కొనసాగింది. ఇంకా కూడా ‘ఆర్ఆర్ఆర్’ జపనీస్ వెర్షన్ అక్కడక్కడా ఆడుతోంది.

తాజాగా రాజమౌళి జపాన్ పర్యటనకు వెళ్లడానికి రెడీ అయ్యాడు. మార్చి 18న ఆయన అక్కడికి వెళ్తున్నాడు. జక్కన్న ఓ ప్రముఖ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షో చూస్తాడని సమాచారం ఇవ్వగా.. అది తెలిసిన ప్రేక్షకులు ఆ షో టికెట్ల కోసం ఎగబడ్డారు. వేల మంది బుకింగ్ కోసం ప్రయత్నించగా.. నిమిషం వ్యవధిలోనే షో సోల్డ్ ఔట్ అయిపోయింది. దీన్ని బట్టి ‘ఆర్ఆర్ఆర్’కు, రాజమౌళికి జపాన్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆల్రెడీ జపాన్‌లో క్రేజ్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’ వల్ల అది ఇంకా పెరిగింది. రామ్ చరణ్ సైతం మంచి గుర్తింపు సంపాదించాడు. రాజమౌళి ‘బాహుబలి’తోనే జపాన్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు.

Tags:    

Similar News