బీచ్ లో రుహానీ బికినీ సెగలు..!
ఫ్రంట్, బ్యాక్ బికినీలో అదిరిపోయింది. ఆమె అందానికి చుట్టూ ఉన్న లొకేషన్ మరింత అందంగా కనపడటం విశేషం.
చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ రుహాని శర్మ. ఆ సినిమాలో చాలా పద్దతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ నటనతో ఆకట్టుకుంది. చూడటానికి సింపుల్ గా ఉంది, నటన మాత్రం అదరగొట్టింది అని అందరూ అనుకున్నారు. ఆ సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమాకి ఆమెకు ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత హిట్ మూవీలో కూడా మెరిసింది.
మొదటి నుంచి డీసెంట్ గా కపడిన రుహానీ, తర్వాత తన లోని గ్లామర్ యాంగిల్ ని కూడా బయట పెట్టడం మొదలుపెట్టింది. సినిమాల్లో కాస్త తక్కువే కానీ, సోషల్ మీడియాలో మాత్రం సూపర్ హాట్ గా కనిపించి మురిపిస్తూ ఉంటుంది. ఇక, తాజాగా బికినీలో మెరిసింది. హాలీడే ట్రిప్ కోసం ఎక్కడికి వెళ్లిందో సరిగా ప్లేస్ క్లారిటీ లేదు కానీ, బీచ్ కి వెళ్లిందని మాత్రం అర్థమౌతోంది.
ముందుగా బాత్రూమ్ లో మిర్రర్ ఎదురుగా సెల్ఫీ తీసుకుంది. ఆ సెల్ఫీలోనూ ఆమె బికినీ ధరించి ఉన్నారు. ఆ తర్వాత ఇక బీచ్ లోకి అడుగుపెట్టిన ఫోటోలను షేర్ చేశారు. ఫ్రంట్, బ్యాక్ బికినీలో అదిరిపోయింది. ఆమె అందానికి చుట్టూ ఉన్న లొకేషన్ మరింత అందంగా కనపడటం విశేషం.
అలలు ఎగసిపడుతుండగా, వాటిని రుహానీ చూస్తూ ఉన్నారు. ఆ బీచ్ అందాలను ఆమె ఆస్వాదిస్తున్నారు. ఇక, బికినీలో ఆమె అందాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. వాటిని చూసి తట్టుకోడం కష్టమే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ హాట్ అంటూ ఎక్కువ మంది కామెంట్స్ చేయడం విశేషం.
ఇక, రుహానీ కెరీర్ విషయానికి వస్తే, ఆమె రీసెంట్ గా ఒమెన్ ఓరియంటెడ్ సినిమా కూడా చేశారు. ‘హర్’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఆమె పవర్ ఫుల్ పోలీసు అధికారిగా కనిపించింది. అయితే, పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి, ఫ్యూచర్ లో ఆమెకు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.