అఫీషియల్.. సలార్ డేట్‌కి అతను ఫిక్స్

సెప్టెంబరు 28 కోసం తెలుగు వాళ్లే కాక.. ఇండియన్ సినిమా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

Update: 2023-09-04 10:33 GMT

సెప్టెంబరు 28 కోసం తెలుగు వాళ్లే కాక.. ఇండియన్ సినిమా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ రోజు రిలీజయ్యే ప్రభాస్ కొత్త సినిమా ‘సలార్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తుందని.. దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ ఆ రోజు జనంతో కళకళలాడిపోతాయని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ సినిమా వాయిదా పడిపోయింది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. ఈ సినిమా ఆ డేట్‌కు రాదన్నది పక్కా. క్రేజీ డేట్ అయిన సెప్టెంబరు 28ను సొంతం చేసుకోవడానికి వేరే చిత్రాలు కర్చీఫ్‌లు వేసేస్తున్నాయి కూడా. ముందుగా కిరణ్ అబ్బవరం సినిమా ‘రూల్స్ రంజన్’ సెప్టెంబరు 28న రిలీజ్ కానున్న విషయంలో అధికారికంగా రూఢి అయింది. ఈ రోజే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబరు 28న రిలీజ్ అని పేర్కొంటూ పోస్టర్ కూడా వదిలేశారు.

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో ప్రామిసింగ్‌గా కనిపించిన కిరణ్.. ఈ మధ్య సరైన సినిమాలు చేయక రేసులో బాగా వెనుకబడిపోయాడు. చివరగా అతణ్నుంచి వచ్చిన ‘మీటర్’ దారుణమైన ఫలితాన్నందుకోవడంతో కిరణ్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. అప్పట్నుంచి సోషల్ మీడియాకు బాగా టార్గెట్ అవుతున్నాడు. ‘రూల్స్ రంజన్’ విషయంలోనూ ట్రోలింగ్ తప్పట్లేదు. ‘సలార్’ రావాల్సిన డేట్‌కు ‘రూల్స్ రంజన్’తో సర్దుకుపోవాల్సి వస్తోందని ఆ సినిమా మీద కౌంటర్లు వేస్తున్నారు జనాలు. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మించగా.. ఆయన పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు. అతను ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ లాంటి ఫ్లాప్ మూవీస్ తీశాడు. చాలా గ్యాప్ తర్వాత అతను తీసిన ‘రూల్స్ రంజన్’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. డీజే టిల్లు, బెదురలంక చిత్రాలతో మెప్పించిన నేహా శెట్టి ఇందులో కథానాయికగా నటించడం ప్లస్ పాయింట్. ఆమె చాలా సెక్సీగా కనిపించిన ‘సమ్మోహనుడా’ పాట యువ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి నేహా లక్ ఫ్యాక్టర్ కలిసొచ్చి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News