23 ఏళ్లకే పెళ్లి అనుకున్నా.. కాని ఇప్పుడు వేరు
తనకు పెళ్లి ఆలోచన లేదని, తన కెరీర్ లో మంచి గుర్తింపు ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని కెరీర్ ను ప్రభావితం చేసుకోలేను అన్నట్లుగా సాయి పల్లవి గతంలోనే క్లారిటీ ఇచ్చింది.
సాయి పల్లవి చెల్లి పూజా వివాహ నిశ్చితార్థ ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వేడుకలో సాయి పల్లవి, పూజా ఇతర కుటుంబ సభ్యులు వేసిన డాన్స్ కు సంబంధించిన వీడియో ఎంతో మందిని ఆకర్షించింది. ఇదే సమయంలో చాలా మంది సాయి పల్లవి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు.
హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న సాయి పల్లవి ఆ స్థాయిలో సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. ఒక వైపు సినిమాలు చేయడం లేదు, మరోవైపు తాను కాకుండా తన చెల్లికి మొదట పెళ్లి చేయడం ఏంటి అంటూ కొందరు నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. వారికి సాయి పల్లవి పాత వ్యాఖ్యలు సమాధానంగా నిలుస్తున్నాయి.
సాయి పల్లవి గతంలో ఒక ఇంటర్వ్యూలో పెళ్లి పై స్పందిస్తూ... నేను 18 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో 23 ఏళ్లకే పెళ్లి చేసుకుని, 30 ఏళ్ల లోపు పిల్లలను కనేయ్యాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాపై కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అందుకే నేను అనుకున్న సమయంలో పెళ్లి చేసుకోలేక పోతున్నాను అంది.
తనకు పెళ్లి ఆలోచన లేదని, తన కెరీర్ లో మంచి గుర్తింపు ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని కెరీర్ ను ప్రభావితం చేసుకోలేను అన్నట్లుగా సాయి పల్లవి గతంలోనే క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతోనే పెళ్లి వద్దనుకుంటున్నట్లుగా సాయి పల్లవి ఆ మాటలను బట్టి అర్థం అవుతుంది.
ఇక ప్రస్తుతానికి తెలుగు లో చైతూకు జోడీగా ఒక సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో ఒక సినిమాను చేస్తోంది. ఈ ఏడాది లో మరిన్ని సినిమాలు కూడా సాయి పల్లవి కమిట్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అమ్మడి ట్యాలెంట్ కి స్టార్ హీరోలు కూడా పిలిచి ఆఫర్లు ఇస్తారు. అయితే పాత్ర కు ప్రాముఖ్యత ఉంటేనే సినిమాను చేసేందుకు సాయి పల్లవి ఓకే చెబుతోంది.