కుమార్తెపై త‌ల్లి 50 కోట్లు పరువు న‌ష్టం దావా!

కుమార్తెపై త‌ల్లి ప‌రువున‌ష్టం దావానా? ఇంత‌క‌న్నా వినాల్సిన వార్త మరోటి ఉంటుందా? క‌లికాలం. ఇంకా ఇలాంటి వార్త‌లు ఎన్ని చూడాల్సి ఉంటుందే.

Update: 2024-11-28 12:30 GMT

కుమార్తెపై త‌ల్లి ప‌రువున‌ష్టం దావానా? ఇంత‌క‌న్నా వినాల్సిన వార్త మరోటి ఉంటుందా? క‌లికాలం. ఇంకా ఇలాంటి వార్త‌లు ఎన్ని చూడాల్సి ఉంటుందే. వివ‌రాల్లోకి వెళ్తే . బెల్లి తెర న‌టి రూపా గంగూలీ సుప‌రిచిత‌మే. ఆమె స‌వతి కుమార్తె ఈషా. అయితే త‌న త‌ల్లి రాచి రంపాన పెండుతుంద‌ని, త‌న తండ్రిని త‌మ‌కు కాకుండా దూరం చేసింద‌ని, త‌న త‌ల్లిని..త‌న‌ని మాన‌సికంగా వేధించింద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో ఈషా వాపోయింది.

ఆ వార్త‌లు నెట్టింట వైర‌ల్ గా మారండంతో రూపా గంగూలీ తెర‌పైకి వ‌చ్చింది. న‌న్నే అంత మాట అంటావా? అంటూ స‌వతి కుమార్తెపై 50 కోట్లు ప‌రువు న‌ష్టం దావా కేసు వేసింది రూపా గంగూలీ. ఈ నేప‌థ్యంలో ఈషా మ‌రోసారి ఇన్ స్టాలోకి వ‌చ్చి త‌న బాధ‌ను చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసింది. `ఈనెల ప్రారంభంలోనే నా వ్య‌క్తిగ‌త స్టోరీని మీతో పంచుకున్నా. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇదే నా జీవితానికి ట‌ర్నింగ్ పాయింట్ కూడా అయింది.

ఏళ్ల‌గా నాలో ఉన్న బాధ‌ని మీతో పంచుకున్నందుకు నా మ‌న‌సుకు ప్ర‌శాంత‌త దొర‌కింది. స్వేచ్ఛ ద‌క్కింది. ఎవ‌రినో ఇబ్బంది పెట్టాల‌న్న‌ది నా ఉద్దేశం కాదు. ఈ అనుభ‌వాలు న‌న్నెలా మార్చాయి? అన్న‌దే చెప్పాల‌నుకున్నా. నిజాయితీగా మాట్లాడటం? త‌ప్పైంది. మా నాన్న‌ను 2013లో రూపా గంగూలీ పెళ్లాడంది. అదే ఏడాది ఆగ‌స్టులో కొడుకును కంది. అప్పుడు మీడియా ఎన్నో క‌థ‌నాలు రాసింది. అప్పుడు నేను మాట్లాడ‌లేదు.

ఇప్పుడు నా అనుభ‌వాన్ని చెబితే త‌ప్పైంది. అంటే నిజం మాట్లాడితే ఇలా కేసులు వేస్తారా? అవును నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. చేదు నోటికి ఎప్పుడూ రుచించ‌దు క‌దా? రూపా గంగూలీ మ‌రోసారి త‌న నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట పెట్టింది. ఇక‌పై ఫ్యామిలీ విష‌యాలేవి మీడియాతో మాట్లాడ‌ను` అని ముగించింది.

Tags:    

Similar News