సీత పాత్ర.. సాయి పల్లవి అలా చేసిందట..!
ఐతే సీత పాత్రలో నటించిన సాయి పల్లవి తన అనుభవాలను రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సౌత్ స్టార్ హీరోయిన్స్ లో సాయి పల్లవి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళ ప్రేమం సినిమాతో మెప్పించిన అమ్మడు తెలుగులో ఫిదా సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా నుంచి సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే అది కచ్చితంగా హిట్ అన్నట్టె అన్న రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యతో తండే సినిమా చేస్తున్న సాయి పల్లవి హిందీలో రామాయణ్ లో నటిస్తుంది. నితేష్ తివారి డైరెక్ట్ చేస్తున్న రామాయణ్ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది సాయి పల్లవి.
రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో యష్ రావణాసురుడిగా చేస్తున్నాడు. ఐతే సీత పాత్రలో నటించిన సాయి పల్లవి తన అనుభవాలను రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. స్వతహాగా ఆధ్యాత్మికత భక్తి భావం ఎక్కువగా ఉండే సాయి పల్లవి సీత పాత్ర చేస్తున్న ప్రతిసారి సీతమ్మని తలచుకుని నా ద్వారా మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటారో అది చేయండి అని ప్రార్ధించిందట.
నటిగా సాయి పల్లవి సీత పాత్రలో పర్ఫెక్ట్ అని దర్శక నిర్మాతలు సెలెక్ట్ చేశారు. కానీ సీత పాత్ర చేసినంత మాత్రాన తాను అది కానని.. సీతగా చేసేప్పుడు సీతమ్మని తలచుకుని సాయి పల్లవి నటించిందట. తన భక్తి భావంతో సీతమ్మని తలచుకుని ఆ పాత్ర చేసిందట సాయి పల్లవి. సాయి పల్లవి చేసే ప్రతి పాత్రలో అంత్ సిన్సియారిటీ ఉంటుంది కాబట్టే ఆమెకు అంతమంది అభిమానులుగా మారుతున్నారు.
ఇన్నాళ్లు సౌత్ ఆడియన్స్ ను మాత్రమే మెప్పించిన సాయి పల్లవి ఇక మీద బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెప్పించాలని చూస్తుంది. తెలుగు, తమిళంతో పాటు అమ్మడు వరుస హిందీ అవకాశాలను కూడా అందుకుంటుంది. బాలీవుడ్ లో సాయి పల్లవి సక్సెస్ అయితే మాత్రం సౌత్ ని వదిలి అక్కడికి షిఫ్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.
సాయి పల్లవి ఏ పరిశ్రమలో సినిమాలు చేసినా సరే ఆమెకు తెలుగు ఆడియన్స్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. సో ఆమె ఫ్యాన్స్ కోసం అయినా సాయి పల్లవి సినిమాలు తెలుగులో రిలీజ్ చేస్తారు. నాగ చైతన్య తండేల్ సినిమాలో కూడా సాయి పల్లవి పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఇదే కాకుండా రీసెంట్ గా శివ కార్తికేయన్ తో సాయి పల్లవి కలిసి నటించిన అమరన్ సినిమా దీపావళి కానుకగా ఈరోజు రిలీజ్ అవుతుంది.