సాయి పల్లవి మ్యాజిక్ అంటే ఇదే..!

అసలే పూనకాలు తెప్పించే సాంగ్.. అందులో సాయి పల్లవి డ్యాన్స్.. ఇంకేం కావాలి చెప్పండి.

Update: 2025-01-06 04:59 GMT

డ్యాన్స్ కూడా నటించడం లో భాగమే అని కొందరు కథానాయికలను చూస్తే అర్ధమవుతుంది. అందులో ముఖ్యంగా సాయి పల్లవి లాంటి వారిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తన సహజ నటనతో ఆకట్టుకుంటూ యూత్ ఆడియన్స్ మనసులు కొల్లగొట్టేస్తున్న అమ్మడు డ్యాన్సుల్లో కూడా అదరగొట్టేస్తుంది. సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఒక సూపర్ డ్యాన్స్ సాంగ్ ఉండాల్సిందే. అలాంటి క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ఎప్పటికప్పుడు తన మార్క్ చూపిస్తూ వస్తుంది. లేటెస్ట్ గా నాగ చైతన్య తండేల్ సినిమాలో నమ శివాయ సాంగ్ తో మరోసారి దుమ్ము దులిపేసింది.

అసలే పూనకాలు తెప్పించే సాంగ్.. అందులో సాయి పల్లవి డ్యాన్స్.. ఇంకేం కావాలి చెప్పండి. తన ప్రత్యేకమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో సాయి పల్లవి చేసే మ్యాజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తండేల్ లో నమ శివాయ సాంగ్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. నమ శివాయ సాంగ్ లో దేవి మ్యూజిక్ తో రెచ్చిపోతే ఆ సంగీతానికి సాయి పల్లవి డ్యాన్స్ తో అదరగొట్టేసింది. ఈ ఒక్క సాంగ్ అది కూడా సాయి పల్లవి డ్యాన్స్ చూసేందుకైనా రిపీటెడ్ ఆడియన్స్ వస్తారనిపించేలా అమ్మడి పర్ఫార్మెన్స్ ఉంది.

ఈ మధ్య సినిమాలో ఏదైనా ఒక హైలెటెడ్ బ్లాక్ ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తండేల్ సినిమాలో ఈ శివయ్య సాంగ్ ఫ్యాన్స్ కి కామన్ ఆడియన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. ఆల్రెడీ తండేల్ సినిమా నుంచి వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ చార్ట్ బస్టర్ కాగా మళ్లీ నమ శివాయ సాంగ్ మరో సూపర్ హిట్ సాంగ్ గా నిలిచింది. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య కూడా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది.

సాయి పల్లవిని మ్యాచ్ చేస్తూ డ్యాన్స్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. అందులో చైతన్య కూడా చాలా కష్టపడినట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ బుజ్జి తల్లి సాంగ్ తో తండేల్ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా ఇప్పుడు ఈ సాంగ్ ని కూడా దేవి శ్రీ తన విజృంభన చూపించాడు. సో రిలీజ్ కు ముందే సాంగ్స్ తోనే తండేల్ అదరగొట్టేస్తుండగా ఇక సినిమా రిలీజ్ అయితే రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారేలా ఉంది. నమ శివాయ సాంగ్ తో తండేల్ వైబ్ డబుల్ అయ్యింది. శివరాత్రికి సినిమా వస్తుండగా బ్లాక్ బస్టర్ పక్కా అన్నట్టుగా అక్కినేని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

Tags:    

Similar News