సాయి పల్లవి నెక్స్ట్ ఏంటి..?
తెర మీద సాయి పల్లవి కనిపిస్తే చాలు ఆడియన్స్ పొందే అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
తెర మీద సాయి పల్లవి కనిపిస్తే చాలు ఆడియన్స్ పొందే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. తన న్యాచురల్ యాక్టింగ్ తో సాయి పల్లవి చూపించే అభినయం ఆమెకు ప్రేక్షకుల హృదయాల్లో గుడి కట్టేలా చేశాయి. సినిమా ఏంటి.. హీరో ఎవరన్నది కాదు అందులో సాయి పల్లవి ఉందా అయితే సినిమా హిట్టే అనే టాక్ వచ్చేసింది. తనకు వచ్చిన ఈ పాపులారిటీ చూసి మరో హీరోయిన్ ఎవరైనా వారి మాటల్లో చేతల్లో తేడా చూపిస్తారు కానీ సాయి పల్లవి అలా కాదు అని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేస్తుంది.
తను ఒక సినిమా పిక్ చేసుకుంది అంటే అది కచ్చితంగా స్పెషల్ అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యేలా చేసుకుంది అమ్మడు. సాయి పల్లవి త్వరలో నాగ చైతన్యతో తండేల్ సినిమాతో రాబోతుంది. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉంది.
ఇక ఈ సినిమా తో పాటుగా అటు బాలీవుడ్ లో ఏక్ దిన్, రామాయణ్ సినిమాల్లో నటిస్తుంది సాయి పల్లవి. సౌత్ లో ఆమె క్రేజ్ చూసి బాలీవుడ్ నుంచి ఆమెకు అవకాశాలు వచ్చేస్తున్నాయి. ఐతే సాయి పల్లవి ఏ భాషలో చేసినా సరే తనకు తెలుగు అంటే ఒక స్పెషల్ బాండ్ ఏర్పడింది. ఇక్కడ ఆడియన్సే ఆమెను స్టార్ గా చేశారు. అందుకే టాలీవుడ్ అంటే ఆమెకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.
తండేల్ తర్వాత ఎలాగు మళ్లీ సాయి పల్లవి కోసం దర్శక నిర్మాతలు క్యూ కడతారు. కానీ వాటిలో సాయి పల్లవికి నచ్చి చేసే సినిమా ఏంటన్నది చూడాలి. ప్రభాస్ ఫౌజి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఐతే సాయి పల్లవి ఆ మూవీని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. సాయి పల్లవి తను చేసే ప్రతి సినిమాతో ప్రతిసారి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. మరి ఈసారి నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తుందో చూడాలి. సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే అటు యాక్టింగ్ తోనే కాదు తన డ్యాన్స్ తో కూడా మెస్మరైజ్ చేస్తుంది. సో అందుకే ఆమె సినీ మేకర్స్ కి అంత ఇంపార్టెంట్ అయ్యింది.