ఆ హీరోతో సాయి పల్లవి సినిమా?
ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలోని పాత్రలన్నీ ప్రత్యేకమైనవే.
ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిని మేం ఎక్కడా చూడలేదు. సాయి పల్లవి గురించి ఎవరిని అడిగినా చెప్పే మాట ఇదే. తన అందం, అభినయంతో తక్కువ కాలంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలోని పాత్రలన్నీ ప్రత్యేకమైనవే. సౌత్ లో తనకున్న క్రేజ్ మామూలుది కాదు.
అందరి హీరోయిన్లలా కాకుండా సాయి పల్లవి చాలా సింపుల్ గా ఉంటుంది. మేకప్ వేసుకోదు, ఎలాంటి హంగామా చేయదు, ఎక్స్‌పోజింగ్ చేయదు, తన సింప్లిసిటీతనే ఆడియన్స్ ను కట్టిపడేసే సాయి పల్లవి సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పటివరకు అమ్మడు రొమాంటిక్ సీన్స్ చేసింది లేదు.
గతేడాది శివ కార్తికేయన్ తో నటించిన అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పల్లవి తాజాగా టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో కలిసి తండేల్ లో నటించి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న సాయి పల్లవి తాజాగా ఓ రొమాంటిక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కు ఇచ్చినట్టు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
రాజ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో శింబు హీరోగా నటిస్తున్న STR49 సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. డాన్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న STR49ను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
శింబు సినిమాలంటే రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. హీరోయిన్లతో లిప్ లాక్ సన్నివేశాలు, రొమాన్స్ ఆయన సినిమాల్లో దాదాపు కచ్ఛితంగా ఉంటాయి. అలాంటి శింబు సినిమాలో సాయి పల్లవి ఎలా నటిస్తుందని కొంతమంది అంటుంటే, ఈ సినిమా కథ ఎలాంటిదో, తన లిమిట్స్ దాటి సాయి పల్లవి ఎప్పుడూ నటించదని మరికొంత మంది అంటున్నారు. ఏదైనా ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.