మా పీఆర్వో శ్యామ్ మీద జోకులు వేశాం కానీ..!- సాయిధ‌రమ్

అలాగే ఈ సినిమాని నిర్మించిన పీపుల్స్ మీడియాపైనా ఆయ‌న ర‌క‌ర‌కాలుగా ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే

Update: 2023-08-02 04:58 GMT

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన BRO ఇటీవ‌లే విడుద‌లై పాజిటివ్ స‌మీక్ష‌ల‌తో ఘ‌న‌మైన ఓపెనింగుల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. యువ‌త‌రం స‌హా ఫ్యామిలీ ఆడియెన్ ని బ్రో చిత్రం థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తోంది. ఇప్ప‌టికే వంద కోట్ల క్ల‌బ్ లో చేరిందని ట్రేడ్ చెబుతోంది.

ఇక ఈ విజ‌యంతో పాటు కొన్ని వివాదాల‌ను త‌లకెత్తుకున్నాడు 'బ్రో'. ముఖ్యంగా వైకాపా నాయ‌కుడు, మంత్రి అంబ‌టి రాంబాబుని కించ‌ప‌రుస్తూ 'శ్యాంబాబు' (౩౦ ఇయ‌ర్స్ పృథ్వీ) పాత్ర‌ను క్రియేట్ చేసార‌ని పార్టీ సీన్ లో అత‌డితో కామెడీలు చేయించార‌ని వివాదం చెల‌రేగింది. మంత్రి అంబ‌టి ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని నిర్మించిన పీపుల్స్ మీడియాపైనా ఆయ‌న ర‌క‌ర‌కాలుగా ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే తాజా మీడియా స‌మావేశంలో అంబ‌టి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూ సాయి ధ‌ర‌మ్ తేజ్ వివ‌ర‌ణ ఇచ్చారు. 'బ్రో' సినిమాలో మంత్రి అంబ‌టి రాంబాబు మీద జోకులు వేస్తూ ఆ సీన్ తీయ‌లేద‌ని.. మా పీఆర్వో శ్యామ్ మీద జోకులు వేసేందుకు తీసామ‌''ని యువ‌హీరో సాయి తేజ్ వ్యాఖ్యానించారు.

మా ఉద్దేశం మా పీఆర్వోనే.. శ్యామ్ మీద జోకులు వేసేందుకు ఆ సీన్లు తీసాం కానీ ఎవ‌రినీ ఉద్ధేశించి తీయ‌లేదని సాయి ధ‌ర‌మ్ అన్నారు. అంతేకాదు ఆనందం సినిమాలో ఎం.ఎస్.నారాయ‌ణ పాత్ర పేరు రాంబాబు.. అంటే అంబ‌టి రాంబాబును ఉద్ధేశించి శ్రీ‌నువైట్ల‌ అలా తీయ‌లేదు క‌దా? అంటూ మీడియా స‌మావేశంలో సాయిధ‌ర‌మ్ తేజ్ గుర్తు చేసారు.

Tags:    

Similar News