ఆత్రేయ దారికొచ్చాడు.. ఇక సైంధవ్ డైరెక్టర్ ఏం చేస్తాడో?

నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు.

Update: 2024-08-31 06:30 GMT

నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ ని నాని తన ఖాతాలో వేసుకోబోతున్నాడని చెప్పవచ్చు. థియేటర్స్ లో మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి. గతంలో వివేక్ ఆత్రేయ అంటే సుందరానికి సినిమాతో నానికి ఫ్లాప్ ఇచ్చాడు. మరల ఇప్పుడు సరిపోదా శనివారంతో సూపర్ హిట్ ఇచ్చి లైన్ లోకి వచ్చాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇక సరిపోదా శనివారం సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ తో ఉత్సాహంగా ఉన్న నాని నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కెరియర్ లో ఫస్ట్ టైం నాని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు. అది హిట్ ఫ్రాంచైజ్ లో వస్తోన్న పార్ట్ 3 మూవీలో కావడం విశేషం. హిట్ 2 మూవీ క్లైమాక్స్ లోనే నెక్స్ట్ పార్ట్ లో నాని హీరోగా కనిపించబోతున్నట్లు రివీల్ చేశారు.

ఇప్పటికే శైలేష్ కొలను ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి ప్రీప్రొడక్షన్ స్టార్ట్ చేసేసాడంట. నాని కూడా గ్యాప్ తీసుకోకుండా వెంటనే హిట్ 3ని పట్టాలు ఎక్కించడానికి రెడీ అయిపోయాడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే హిట్ 3 మూవీ లాంచింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేసారంట. సెప్టెంబర్ 5న అఫీషియల్ గా హిట్ 3 చిత్రాన్ని నాని స్టార్ట్ చేయబోతున్నాడంట.

తన వాల్ పోస్టర్ బ్యానర్ లోనే హిట్ 3 మూవీ తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాది సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శైలేష్ కొలను డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. అంతకు ముంది శైలేష్ హిట్1, 2 సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. హిందీలో హిట్1 రీమేక్ చేయగా అక్కడ ఫ్లాప్ అయ్యింది. దీంతో శైలేష్ కొలను ఖాతాలో రెండు హిట్స్, రెండు ఫ్లాప్స్ ఉన్నాయి.

సైంధవ్ తో డిజాస్టర్ అందుకున్న శైలేష్ మరల తనకి కలిసొచ్చే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ హిట్ ఫ్రాంచైజ్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడా అనేది వేచి చూడాలి. ఇక హిట్ ఫ్రాంచైజ్ లో ఇప్పటికే రెండు సక్సెస్ లని నిర్మాతగా తన ఖాతాలో వేసుకున్న ఈ సారి హీరో కమ్ నిర్మాతగా ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.

Tags:    

Similar News