సైంధవ్.. బాక్సాఫీస్ వద్ద ఎంత వస్తే హిట్టు

ఇక బాక్సాఫీస్ వద్ద లాభాల్లోకి రావాలి అంటే తప్పనిసరిగా 26 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది అని చెప్పవచ్చు.

Update: 2024-01-10 08:04 GMT

ఈ సంక్రాంతికి ఏ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఎందుకంటే ప్రతి సినిమా కూడా డిఫరెంట్ స్టైల్లో బజ్ క్రియేట్ చేసుకుంటున్నాయి. అయితే ఎంత హైప్ క్రియేట్ అయినప్పటికీ కూడా తప్పకుండా మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తేనే ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పోటీలో విభిన్నంగా ఆకట్టుకునేందుకు సైంధవ్ సినిమా కూడా సిద్ధం అవుతుంది.

వెంకటేష్ హీరోగా 75వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఇక ట్రైలర్ తోనే మరింత అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఏర్పరచుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే, నైజాం ఏరియాలో దాదాపు 7 కోట్ల ధర పలికినట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రలో 9 కోట్ల రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో టోటల్ గా 19 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటువైపు 2 కోట్లు ధర పలికిన ఈ సినిమా ఓవర్సీస్ లో దాదాపు 4 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 25 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద లాభాల్లోకి రావాలి అంటే తప్పనిసరిగా 26 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై క్రియేట్ అవుతున్న బజ్ చూస్తూ ఉంటే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనిపిస్తోంది.

ఎందుకంటే దర్శకుడు శైలేష్ కొలరు ఇదివరకే తన హిట్ సినిమాలతో మార్కెట్లో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఓ వర్గం ఆడియెన్స్ అతనిపై చాలా నమ్మకంగానే ఉన్నారు. కాబట్టి ఈ సంక్రాంతికి సైంధవ్ కూడా మిగతా సినిమాలకు బలంగా పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

సైంధవ్ ప్రీ రిలీజ్ బిజినెస్

నైజాం: 7Cr

సీడెడ్: 3Cr

ఆంధ్రా: 9Cr

ఏపీ తెలంగాణ మొత్తం:- 19CR

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 2Cr

ఓవర్సీస్ - 4Cr

ప్రపంచ వ్యాప్తంగా - 25CR

టార్గెట్ షేర్ కలెక్షన్స్ - 26 కోట్లు

Tags:    

Similar News