'సైంధవ్' బాక్సాఫీస్.. పరిస్థితి ఎలా ఉందంటే?
టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కెరియర్లో 75వ చిత్రం గా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'సైంధవ్' సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దాంతో పాటూ వెంకటేష్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ యాక్షన్ మూవీ రావడంతో వెంకీ ఫ్యాన్స్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
జనవరి 13న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సుమారు రూ.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని రూ.26 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి దిగిన ఈ చిత్రం మొదటి రోజు మూవీ కేవలం 5.45 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకోగా రెండో రోజు మరింత తక్కువ కలెక్షన్స్ తో నిరాశపరిచింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకలేదు.
ఇక ఏరియాల వారిగా సైంధవ్ 2 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి..
నైజాం : 1.88 కోట్లు
సీడెడ్ : 52 లక్షలు
ఉత్తరాంధ్ర : 48లక్షలు
ఈస్ట్ : 33 లక్షలు
వెస్ట్ : 19 లక్షలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ : 4.13కోట్లు షేర్(7.15కోట్లు గ్రాస్)
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా: 30లక్షలు
ఓవర్సీస్: 55 లక్షలు
టోటల్ వరల్డ్ వైడ్ : 4.98కోట్లు షేర్ (9కోట్లు గ్రాస్)
రెస్పాన్స్ కూడా అంతంత మాత్రం గానే ఉండడంతో కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ తెలుగులో తప్పితే ఇతర భాషల్లో సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ విలక్షణ నటుడు నమాజుద్దీన్ సిద్ధిక్ ఈ మూవీ తో విధంగా టాలీవుడ్ కి ఆరంగేట్రం చేశాడు. సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. తమిళ హీరో ఆర్య మరో కీలక పాత్రలో కనిపించారు.