సినిమా మధ్యలో తప్పుకోవాలనుకున్న సాయి పల్లవి..!
అదేంటో సాయి పల్లవి చేసిన ప్రతి సినిమా ప్రతి పాత్ర ఆమె కోసమే అన్నట్టుగా ఉంటాయి.
సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సాయి పల్లవి కథల ఎంపికలో తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. మలయాళ ప్రేమం సినిమాతో యూత్ ఆడియన్స్ కు దగ్గరైన ఆమె తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇచ్చి అప్పటి నుంచి తిరుగు లేని క్రేజ్ తెచ్చుకున్నారు. అదేంటో సాయి పల్లవి చేసిన ప్రతి సినిమా ప్రతి పాత్ర ఆమె కోసమే అన్నట్టుగా ఉంటాయి. అందుకే ఆమె మిగతా హీరోయిన్స్ కన్నా చాలా స్పెషల్ అనిపిస్తుంది.
ఐతే తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో అదరగొడుతున్న సాయి పల్లవి కెరీర్ లో ఒక సినిమా డైరెక్టర్ వల్ల ఇబ్బంది పడిందట. అంతేకాదు సినిమా మధ్యలో నుంచి తప్పుకుందామని కూడా అనుకుందట. కానీ మధ్యలో మరో హీరో ఇన్వాల్వ్ అవ్వడంతో అంతా సెట్ రైట్ అయినట్టు ఎలుస్తుంది. ఇంతకీ సాయి పల్లవి మధ్యలో వదిలేద్దాం అనుకున్న సినిమా ఏది అంటే తమిళ సినిమా ఎన్.జి.కె అని తెలుస్తుంది.
సూర్య లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాను సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా రెండు మూడు రోజుల షూటింగ్ టైం లో డైరెక్టర్ షాట్ అయ్యాక సాయి పల్లవితో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదట. దానికి తాను సరిగా చేయట్లేదేమో అనుకుని సినిమా నుంచి తప్పుకోవాలని అనుకుందట. ఐతే ధనుష్ సినిమా ఎలా జరుగుతుందని ఫోన్ చేస్తే విషయం అతనికి చెప్పిందట. దానికి ధనుష్ సెల్వ రాఘవన్ ముందు ఆర్టిస్ట్ లను అలానే టెస్ట్ చేస్తారని సర్ధి చెప్పారట.
అలా కొంత పార్ట్ షూట్ అయ్యాక సెల్వ రాఘవన్ కూడా సాయి పల్లవి నటనకు మంచి ప్రోత్సాహం అందించారట. ఐతే ముందు రెండు రోజుల అతని ప్రవర్తన వల్ల సాయి పల్లవి ఆ సినిమా నుంచే తప్పుకోవాలి అన్నంత బాధ ఏర్పడిందట. నటిగా తనకు వస్తున్న ప్రతి పాత్రలో 100కి 100 శాతం అవుట్ పుట్ వచ్చేలా చేస్తుంది సాయి పల్లవి.
స్వతహాగా డ్యన్సర్ కాబట్టి అలా కూడా సినిమాలకు ప్లస్ అవుతుంది. సాయి పల్లవికి సరైన పాత్ర పడాలే కానీ ఆమె నేషనల్ అవార్డ్ తెచ్చుకోవడం పక్కా అని ఆమె ఫ్యాన్స్ అంటుంటారు. అది నిజమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లేటెస్ట్ గా తమిళ సినిమా అమరన్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి. శివ కార్తికేయన్ లీడ్ రోల్ లో నటించిన అమరన్ సినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కింది.