సాయం చేయకపోతే చనిపోయినవాళ్లతో సమానం! సాయిపల్లవి
తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేస్తే అమర్ నాధ్ అనుభవాలు.. అనుభూ తులు పంచుకున్నారు. ఆ వేంటో ఆమె మాటల్లోనే..
సాయి పల్లవి ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా 'విరాట పర్వం' సినిమాలో కనిపించింది. ఆ తర్వాత అమ్మడి జాడ కానరాలేదు. అవకాశాలు లేక నటించలేదా? రాక నటించలేదా? అన్నది సస్పెన్స్ . తాజాగా ఆ మధ్య అమర్ నాధ్ యాత్రకు వెళ్లిన కొన్ని ఫోటోలు నెట్టింటం పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేస్తే అమర్ నాధ్ అనుభవాలు.. అనుభూ తులు పంచుకున్నారు. ఆ వేంటో ఆమె మాటల్లోనే..
'వ్యక్తిగత విషయాలు పంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించను. కానీ అమరనాధ్ యాత్ర గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఎంతో కాలం నుంచి కలలు కంటోన్న యాత్ర ఇది. 60 ఏళ్ల వయసున్న తల్లిదండ్రులను ఈ యాత్రకి తీసుకెళ్లడం సవాల్ తో కూడుకున్నదే. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది గా మారుతుంది. నడవలేక చాలా అవస్తలు పడతారు.
దారి మధ్యలో అలసిపోవడం వంటివి చూసి స్వామి మీరు ఎందుకు ఇంత దూరంలో ఉన్నారు? అనిపిస్తుంది. అయితే దైవ దర్శనం అనంతరం నా ప్రశ్న కి సమాధానం దొరికింది. కొండ కిందకు దిగి వచ్చేటప్పుడు మనసును హత్తుకునే దృశ్యం ఒకటి చూసా. యాత్రని కొనసాగించలేక ఇబ్బంది పడుతోన్నప్పుడు వాళ్లలో ధైర్యం నింపడం కోసం చుట్టు పక్కల వారు ఓం నమశివాయా అంటూ స్వామి వారిని స్మరించేవారు.
వెళ్లలేం అనుకున్న వారు కూడా ఒక్కసారిగా అడుగుల ముందుకెసి ఉత్సాహంగా కదిలేవారు. మాలాంటి లక్షలాది భక్తులకు ఈ యాత్ర ఓ చిరస్మరణీయం చేసిన అందరికీ ప్రణామాలు. ఈ యాత్ర నా సంకల్ప శక్తిని సవాల్ చేయడంతో పాటు నాధైర్యాన్ని పరీక్షించింది.
మన జీవితమే ఓ తీర్ధయాత్రని తెలియజే సింది. మనిషిగా ఉన్నందుకు ఎదుట వ్యక్తులకు సాయం చేయకపోతే మనం చనిపోయిన వాళ్లతో సమానం. సంపద..అందం..పవర్ తో సంబంధం లేకుండా ఇతరులకు సాయం చేయడమే ఈ భూమిపై మన ప్రయాణానికి విలువనిస్తుంది' అని అన్నారు.