సాయి పల్లవికి ఏం తింటుందో తెలిస్తే షాక్...!
ఇప్పటికి కూడా తాను ఏదైనా ప్రదేశంకు వెళ్తున్నాను అంటూ నా బ్యాగ్ లో విభూది పెట్టుకుని ఉంటాను.
ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగు లో చేసిన ప్రతి సినిమాతో కూడా తనదైన శైలి నటనతో డాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. లవ్ స్టోరీ వంటి కమర్షియల్ సినిమాలో నటించినా.. విరాటపర్వం వంటి విభిన్నమైన సినిమాలో నటించినా కూడా ఆమె శైలిని అంతా కూడా వావ్ అంటూ ప్రశంసించారు అనడంలో సందేహం లేదు.
ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ కు ఈమె దూరం గా ఉండాలని భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె హీరోయిన్ గా తమిళంలో ఒక సినిమా రూపొందుతోంది. కానీ తెలుగు లో మాత్రం ఈమె సినిమా చేయడం లేదు. తెలుగు లో వచ్చిన ఆఫర్లను కూడా కాదనుకుంటూ ఉందట.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు విభూది తినడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా తాను ఏదైనా ప్రదేశంకు వెళ్తున్నాను అంటూ నా బ్యాగ్ లో విభూది పెట్టుకుని ఉంటాను. ఆ విబూధి తినడం అనేది నాకు ఎప్పటికి మర్చిపోలేని అలవాటుగా మారింది.
ఒక మంచి వృక్షం నుండి తయారు చేసిన విభూది ఆరోగ్యానికి చాలా మంచిది అని కూడా ఆమె పేర్కొంది. హీరోయిన్ అయినప్పటికి... ఒక డాక్టర్ అయినప్పటికి కూడా సాయి పల్లవి విభూది తినడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం సాయి పల్లవి విభూది విషయం వైరల్ అవుతోంది.