NC23 కోసం సాయి పల్లవి అంత డిమాండ్ చేసిందా?
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మూవీ NC23.
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మూవీ NC23. రియల్ లైఫ్ సంఘటన స్ఫూర్తితో సిద్ధమైన ఈ స్టోరీ శ్రీకాకుళం మత్యకారుల జీవితాల నేపథ్యంలో ఉంటుందంట. మూవీలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా నటిస్తాడని, సాయి పల్లవి కూడా ఫిషర్ మెన్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి పాత్రలోనే కనిపించనుందని తెలుస్తోంది.
రీసెంట్ గా ఈ చిత్రంలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఎనౌన్స్ చేస్తూ ప్రకటన చేశారు. సాయి పల్లవి కూడా చాలా రోజుల తర్వాత తెలుగులో మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తూ ఉండటంతో ఎగ్జైటింగ్ గా ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. లవ్ స్టోరీ మూవీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో రాబోతోన్న రెండో మూవీ ఇది కావడం విశేషం. ఇందులో సాయి పల్లవి పాత్ర చాలా బలంగా ఉంటుందంట.
విరాటపర్వం తర్వాత సాయి పల్లవి తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయిన కూడా ఆమె నాగ చైతన్యతో చేయబోయే సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుందంట. ఇప్పటి వరకు ఆమె రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే 30 శాతం అధికంగా డిమాండ్ చేసిందంట. ఇక నిర్మాత బన్నీ వాస్ కూడా సాయి పల్లవి డిమాండ్ చేసినంత ఇవ్వడానికి ఒకే చెప్పారంట.
ఇందులో పాత్రకి ఆమె తప్ప మరెవరు సెట్ కారని దర్శకుడు బలంగా నమ్మడంతో సాయి పల్లవి డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ని ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇక మూవీ ప్రొడక్షన్ కాస్ట్, విఎఫ్ఎక్స్ కి అధికంగా ఖర్చవుతుందంట. మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి అవుట్ పుట్ చేతికి వచ్చేసరికి వంద కోట్ల వరకు బడ్జెట్ అవ్వొచ్చని భావిస్తున్నారు.
చందూ మొండేటి కెరియర్ కూడా ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఇప్పటికే కార్తికేయ2 తో పాన్ ఇండియా దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న చందూకి ఈ మూవీ ఎలాంటి హిట్ ఇస్తుందో అనేది చూడాలి.