లవ్ స్టోరీ కాంబినేషన్ రిపీట్ ?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా వచ్చిన చిత్రం లవ్ స్టోరీ.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సాయి పల్లవి ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తోంది. హిందీలో అమీర్ ఖాన్ తనయుడి సినిమా కోసం సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అఫీషియల్ గా మాత్రం ఇంకా దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.
ఫిదా హిట్ తర్వాత సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు. కానీ ఆమె సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. తాను నటించే సినిమాలో కచ్చితంగా తన పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంది అంటేనే చేయడానికి ఒప్పుకుంటుంది. లేదంటే నిర్మొహమాటంగా చేయనని చెప్పేస్తుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేవునీకెవ్వరు మూవీ ఆఫర్ ని వదులుకుంది.
అలాగే భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలు పాత్రని కూడా కాదనుకుంది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఓ ఫంక్షన్ లో చెప్పారు. తెలుగులో ఆమె చివరిగా చేసిన చిత్రం విరాటపర్వం. దాని తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి మూవీకి కమిట్ కాలేదు. అయితే ప్రస్తుతం కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి NC23 మూవీ గీతా ఆర్ట్స్ లో చేయబోతున్నాడు.
ఈ సినిమా కథ నేపథ్యం అంతా శ్రీకాకుళం జిల్లా మత్యకారుల బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. సముద్రంపై వేటకు వెళ్లేవారి జీవన విధానం, వారి కష్టాలు ఈ కథలో మెయిన్ పిల్లర్ గా ఉంటాయి. ఈ చిత్రంలో చైతూకి జోడీగా కీర్తి సురేష్, సాయి పల్లవిలో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ చేశారు. NC 23 టీం మాత్రం ఫైనల్ గా సాయి పల్లవిని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఫిషర్ మెన్ కమ్యూనిటీలో హీరోయిన్ పాత్ర అంటే కచ్చితంగా పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంటుంది. అందుకే సాయి పల్లవిని అయితే బెస్ట్ ఛాయస్ అని భావించి ఆమెని ఎంపిక చేశారంట. ఇది అఫీషియల్ గా ఖరారైతే లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోయే రెండో సినిమా ఇదే అవుతుంది.