సలార్ - హనుమాన్.. ఒక్కటే దారి..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు బాక్స్ ఆఫీస్ వద్ద చాలా గట్టిగానే సందడి చేసే అవకాశం ఉంది.

Update: 2023-11-09 08:54 GMT

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు బాక్స్ ఆఫీస్ వద్ద చాలా గట్టిగానే సందడి చేసే అవకాశం ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ఆ సినిమాలు ఇండస్ట్రీలో పాత రికార్డులను కూడా బ్రేక్ చేస్తాయి అని చెప్పవచ్చు. అంతగా ఇంపాక్ట్ ఉన్న సినిమాలే ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

అందులో బడా పాన్ ఇండియా సినిమాలే కాకుండా చిన్న తరహా పాన్ ఇండియా సినిమాలు కూడా ఉండడం విశేషం. ముఖ్యంగా సలార్ - హనుమాన్ రెండు సినిమాలు చాలా ప్రత్యేకమైనవి అని చెప్పాలి. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొంత ఆలస్యం కావడంతో డిసెంబర్ 22 కి మార్చిన విషయం తెలిసిందే.

తప్పకుండా అనుకున్న డేట్ కు వస్తాము అని ఈసారి వెనక్కి తగ్గేది ఉండదు అని చిత్ర నిర్మాణ సంస్థ గట్టిగానే క్లారిటీ ఇస్తుంది. అలాగే మరోవైపు హనుమాన్ కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు సంక్రాంతికి తాము రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు విడుదల డేట్ మళ్లీ మారే అవకాశం ఉంది అని చెప్పిన ప్రతిసారి కూడా మేకర్స్ ఏదో అప్డేట్ తో మాత్రం క్లారిటీ అయితే ఇస్తున్నారు.

అయితే ఈ గాసిప్స్ కు ఎండ్ కార్డు పెట్టాలి అంటే తప్పకుండా ట్రైలర్ విడుదల కావాల్సిందే. ట్రైలర్ విడుదలయితే సినిమా రిలీజ్ డేట్ విషయంలో దాదాపు ఒక క్లారిటీ వచ్చినట్లే. ఇక ఇప్పటివరకు సలార్ హనుమాన్ మేకర్స్ నుంచి టీజర్స్ మాత్రమే వచ్చయు. ఇక ఈ డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్స్ వస్తే మాత్రం వాయిదా పుకార్లకు ముగింపు కార్డు పెట్టవచ్చు.

ఇంకా ఇప్పటికే హనుమాన్ టీమ్ ప్రమోషన్స్ అయితే మొదలు పెట్టింది. ఇక సలార్ సినిమా ప్రమోషన్స్ మొదలు కావాల్సి ఉంది. ప్రభాస్ రీసెంట్గా విదేశాల నుంచి తిరిగి వచ్చేసాడు. అతను తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా చాలా స్ట్రాంగ్ గా ప్రమోషన్స్ కోసం తిరగబోతున్నాడు. హనుమాన్ కూడా ప్రమోషన్స్ కోసం కొత్త తరహా ప్రణాళికలు రచిస్తోంది. మరి సంక్రాంతి పోటీలో ఈ సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News