సలార్: తెలంగాణ బెనిఫిట్ షోలు.. ఏపీలో మాత్రం ఇలా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సలార్ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది

Update: 2023-12-19 16:14 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సలార్ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేసిన యాక్షన్ ట్రైలర్.. అందరినీ ఆకట్టుకుని సినిమాపై బజ్ భారీగా పెంచేసింది. మూవీ కచ్చితంగా చూడాల్సిందేనన్న రీతిలో హైప్ క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కార్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్‌ల్లో రూ.100, సింగిల్‌ స్క్రీన్ లో రూ.65 పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రూ.40 చొప్పున పెంచేందుకు అనుమతించింది.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిక్వెస్ట్ మేరకు తెలంగాణలో డిసెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు టికెట్ ధరల పెంపునకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని 20 థియేటర్లలో మాత్రమే అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్‌ షో వేసేందుకు అనుమతులు ఇచ్చింది. రెగ్యులర్ షోలతోపాటు ఎక్స్ ట్రాగా మార్నింగ్ నాలుగు గంటలకు ఆరో షో వేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైదరాబాద్ లో అర్థరాత్రి ఒంటి గంటకు 12 థియేటర్లలో సలార్ బెనిఫిట్ షోలు వేయనున్నారు. ఆ థియేటర్లు ఇవే..

1) నెక్సస్ మాల్, కూకట్‌పల్లి

2) AMB సినిమాస్, గచ్చిబౌలి

3) భ్రమరాంబ, కూకట్‌పల్లి

4) మల్లికార్జున, కూకట్‌పల్లి

5) అర్జున్ థియేటర్, కూకట్‌పల్లి

6) విశ్వనాథ్, కూకట్‌పల్లి

7) సంధ్య 70MM, ఆర్టీసీ క్రాస్ రోడ్స్

8) సంధ్య 35MM, ఆర్టీసీ క్రాస్ రోడ్స్

9) రాజధాని డీలక్స్, దిల్ సుఖ్ నగర్

10) శ్రీరాములు, మూసాపేట

11) గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ

12) శ్రీ సాయిరాం, మల్కాజిగిరి

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లో సాధారణ థియేటర్లతోపాటు మల్టీపెక్సుల్లో రూ.40 మాత్రమే పెంచుకునేలా ప్రభుత్వం అనుమతించింది. సినిమా రిలీజ్ అయిన పది రోజుల వరకు మాత్రమే కొత్త రేట్లు ఉంటాయని చెప్పింది. ఎక్స్ ట్రా షోలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు.

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో హీరో ప్రభాస్ తోపాటు శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Tags:    

Similar News