'సలార్' ట్రైలర్.. పోటీగా 'డంకీ' ఆయుధం!
ఈ ఏడాది పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుక్ దెబ్బకి ప్రభాస్ పని అయిపోతుంది అని నార్త్ ఆడియన్స్ అంటుంటే..
పాన్ ఇండియా హీరో ప్రభాస్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మధ్య డిసెంబర్ మూడో వారంలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ జరగబోతుంది. ఈ ఇద్దరు హీరోల సినిమాలు కేవలం ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఓ రేంజ్ లో వార్ జరుగుతోంది. ఈ ఏడాది పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుక్ దెబ్బకి ప్రభాస్ పని అయిపోతుంది అని నార్త్ ఆడియన్స్ అంటుంటే..
సలార్ దెబ్బకి డంకీ గల్లంతు అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద పై చేయి సాధిస్తుంది? ఏ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? అనేది తెలియాలంటే డిసెంబర్ 21, 22 తేదీల వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ బాక్సాఫీస్ వార్ ని ఇంకాస్త హీట్ పెంచేందుకు సలార్ మూవీ నుంచి ట్రైలర్ విడుదలవుతుంటే, డంకీ నుంచి డ్రాప్ 2 పేరుతో ట్రైలర్ రిలీజ్ కానుంది. వీటిలో సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న విడుదల కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.
దీంతో ఇప్పటికే సలార్ ట్రైలర్ కండౌన్ స్టార్ట్ అయిపోయింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా అంతా సలార్ మేనియాలో ఉండగా తాజాగా ఆ ప్లేస్ లో డంకీ ట్రెండింగ్ లోకి వచ్చింది. డంకీ డ్రాఫ్ 2 నవంబర్ 22 న రిలీజ్ కానుంది అంటూ సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ మొదలైంది. అయితే మేకర్స్ నుంచి దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ సలార్ ట్రైలర్ కౌంట్ డౌన్ ట్రెండ్ అవుతున్న సమయంలో డంకీ డ్రాప్ 2 కూడా ట్రెండ్ అవ్వడం చూస్తుంటే..
షారుక్ - ప్రభాస్ మధ్య బాక్సాఫీస్ వార్ కి ఈ ప్రమోషనల్ కంటెంట్స్ పునాది వేసినట్లయ్యింది. మరి ఈ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ లో షారుక్ గెలుస్తాడా? లేక ప్రభాస్ గెలుస్తాడా? అనేది చూడాలి. ఇక 'డంకీ' విషయానికి వస్తే.. బాలీవుడ్లో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరొందిన రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నార్త్ లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతోంది.
ఇక సలార్ విషయానికి వస్తే, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.