హిందీలో సలార్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే?
అయితే థీయాట్రికల్ బిజినెస్ లెక్కల ప్రకారం సలార్ హిట్ టాక్ రావడాలంటే కనీసం 200 కోట్లు కలెక్ట్ చేయాలి.
సలార్ మూవీ సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. బాహుబలి, సాహో, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ నార్త్ ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. అక్కడ స్టార్ హీరోలైన ఖాన్ త్రయంతో సమాన ఇమేజ్ ఉంది. ఈ కారణంగానే నార్త్ బెల్ట్ లో ప్రభాస్ కి సాలిడ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి.
ప్రభాస్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడే నార్త్ ఇండియన్స్ అతనికి ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు సలార్ మూవీకి కూడా హిందీలో భారీ హైప్ ఉంది. షారుఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ అవుతోన్న కూడా దానికంటే సలార్ చిత్రం చూడటానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం. డంకీ క్లాస్ స్టొరీ కావడం వలన అంత బజ్ క్రియేట్ చేయడం లేదు. దానికితోడు ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు.
అయితే సలార్ మూవీ నుంచి రెండు ట్రైలర్స్ వచ్చాయి, సాంగ్ రిలీజ్ అయ్యింది. అలాగే ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇవన్ని కూడా మూవీని ప్రమోట్ చేస్తున్నాయి. తాజాగా వచ్చిన సెకండ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 హిందీలో ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది.
ఈ సినిమా రికార్డుని సలార్ బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే థీయాట్రికల్ బిజినెస్ లెక్కల ప్రకారం సలార్ హిట్ టాక్ రావడాలంటే కనీసం 200 కోట్లు కలెక్ట్ చేయాలి. అదేమీ పెద్ద టార్గెట్ అయితే కాదు. కాని సినిమాకి పాజిటివ్ టాక్ వస్తేనే ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడతారు.
కేజీఎఫ్ సిరీస్ లో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోకి ఆడియన్స్ ని ప్రశాంత్ నీల్ తీసుకొని వెళ్ళడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే సలార్ తో ఖాన్సార్ యూనివర్స్ లోకి ప్రేక్షకుల ఏ మేరకు తీసుకొని వెళ్తాడనే దానిపై మూవీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.