సలార్ డైరెక్షన్ సగ భాగం ప్రభాస్ కి ఇవ్వాలి!
ప్రశాంత్ నీల్ ...కేజీఎఫ్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించిన చిత్రం. అయితే ఈసినిమా క్రియేటివ్ విభాగంలో డార్లింగ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలని ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది.
సలార్` క్రియేటివ్ విభాగంలోనూ డార్లింగ్ పనిచేసాడా? డైరెక్షన్ క్రెడిట్ డార్లింగ్ కూడా సగం ఇవ్వాలా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన `సలార్` రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైన సంగతి తెలిసిందే. మరో వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతగా శ్రమించిందో చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రెండు సంవత్సరాల శ్రమ. రెయింబవళ్లు శ్రమించి పనిచేసిన చిత్రం.
ప్రశాంత్ నీల్ ...కేజీఎఫ్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించిన చిత్రం. అయితే ఈసినిమా క్రియేటివ్ విభాగంలో డార్లింగ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలని ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ప్రభాస్ కొన్ని ఆసక్తిర విషయాలు షేర్ చేసారు. ఇంతవరకూ ప్రభాస్ మీడియా సమావేశం లో ఎక్కడా పాల్గొనలేదు. తొలిసారి ఎక్స్ క్లూజివ్ గా ఈ విషయాలు ఓ మీడియా సంస్థతో పంచుకున్నట్ల తెలుస్తోంది. ఆవేంటో ఆయన మాటల్లోనే..
`పాత్రల మధ్య బమలైన భావోద్వేగాలుంటాయి. ప్రేక్షకులు ఇంతవరకూ చూడనటవంటి పాత్రలో నన్ను చూస్తారు. నేను -ప్రశాంత్ కలిసి పనిచేయాలనుకున్నప్పుడు సినిమా ఎలా ఉంటే ఆకట్టుకుంటుందనే అంశాలపై ఎక్కువగా చర్చించాం. నేను నా ఆలోచనల్ని తన ముందు పెట్టా. దానికి తనేం చేయాల నుకున్నాడో వివరించేవాడు. మేము అనుకున్న కథకి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? అన్నది అప్పుడే డిస్కస్ చేసాం.
నేను చెప్పిన ఆలోచనల్లో కొన్ని ప్రశాంత్ కి నచ్చాయి. అలాగే తను నన్ను ఎలా చూపించాలనుకున్నారో? నాకు వివరించేవారు. అలా ఇద్దరు కలిసి వర్క్ షాప్స్ చేసాం. నా కెరీర్ ప్రారంభించి 21 ఏళ్లు అవుతుంది. ప్రశాంత్ తో ఎప్పుడు సినిమా చేద్దామానా? ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూసా. నా ఇన్నేళ్ల కెరీర్ ని ఎప్పుడు ఇలా భావించలేదు. షూటింగ్ ప్రారంభమైన నెల రోజుల్లోనే మంచి స్నేహితులం అయ్యాం. పాత్ర కోసం కండలు పెంచాలని చెప్పారు. నేను చేసింది అదే మిగతాదంతా తనే చూసుకున్నారు. హీరోల్ని గొప్పగా చూపించే దర్శకుడు అతను` అని అన్నారు.