ప్రభాస్ రెమ్యునరేషన్ ఓకే.. మరి దర్శకుడికెంత?
బిగ్గెస్ట్ యాక్షన్ పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న సలార్ పై అంచనాలు రోజురోజుకు అమాంతంగా పెరిగిపోతున్నాయి
బిగ్గెస్ట్ యాక్షన్ పాన్ ఇండియా మూవీ గా రాబోతున్న సలార్ పై అంచనాలు రోజురోజుకు అమాంతంగా పెరిగిపోతున్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని మొదట్లోనే చాలా రకాల హైప్ అయితే క్రియేట్ అయింది. కానీ ఊహించిన విధంగా సినిమా వాయిదా పడడంతో కంటెంట్ మీద చాలా అనుమానాలు అయితే క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమాలో ప్రభాస్ ఫేస్ లుక్ ఎలా ఉంటుంది అనే విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటివరకు ఫస్ట్ లుక్ టీజర్ లో కూడా చూపించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఏదేమైనప్పటికి దర్శకుడు ప్రశాంత్ పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ తో సినిమాను ఆడియన్స్ ముందుకు సినిమాను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
సీజీ వర్క్ కోసం ఇంకాస్త టైం పడుతుంది అని సినిమాను డిసెంబర్ కు వాయిదా వేశారు. ఇక ఈ సినిమా పైన డిమాండ్ అయితే అసలు తగ్గలేదు. అలాగే వాయిదాకు కారణం సినిమా ఓటీటీ ఒక డీల్ సెట్ కాకపోవడం వల్లే అని టాక్ వినిపించింది. అయితే మొత్తానికి నెట్ ఫ్లెక్స్ మాత్రం సలార్ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరలు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ పై కూడా చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. అయితే ప్రభాస్కు 100 కోట్లకు పైగానే ఇచ్చి ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. మొత్తం అయితే 120 నుంచి 130 కోట్లు మధ్యలో ప్రభాస్ తో ఈ సినిమా ద్వారా అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు ఈ సినిమా నుంచి మాత్రం మరొక విధంగా లాభాలను అందుకోబోతున్నాడు.
సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా అందుకునే విధంగా దర్శకుడు ముందుగానే నిర్మాతలతో డీల్ సెట్ చేసుకున్నాడు. కేజిఎఫ్ సెకండ్ పార్ట్ కి కూడా దర్శకుడు ఈ తరహాలోనే డీల్ సెట్ చేసుకొని మంచి ఆదాయాన్ని అయితే సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా ఒక రేంజ్ లో సక్సెస్ అయితే మాత్రం అతనికి కూడ 100 కోట్లకు పైగానే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.