'సలార్' కంటిన్యూటీపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `సలార్` భారీ అంచనాల మధ్య ఈనెల 22న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `సలార్` భారీ అంచనాల మధ్య ఈనెల 22న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అంచనాలు పీక్స్ లో ఉన్న నేపథ్యంలో ఆన్ లైన్ టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. ఇప్పటికే వన్ మిలియన్ కి పై గా టికెట్లు సేల్ అయిపోయాయి. డే వన్ ఫస్ట్ షో ఎప్పుడు పడుతుందా? అని ప్రేక్షకాభిమానులు ఆ గడియలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రిలీజ్ కి ఇంకా సరిగ్గా వారం రోజులే సమయం ఉండటంతో! అభిమానుల్లో ఆసక్తి అంతకంతకు రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ రావడంతో! మరింత ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుంది. సినిమాకి ఏ సర్టిఫికెట్ ఏ కారణంగా ఇచ్చారు? అ శ్లీలతో..యాక్షన్ కృరత్వంగా ఉండటం తోనా? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటన్నింటిపై చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.
సినిమాలో యాక్షన్ పీక్స్ లో ఉంటుందన్నారు. `అవి చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. ప్రేక్షకులు ఆ సీన్స్ చూసేటప్పుడు ఎలాంటి అసౌకర్యానికి గురికాకూడదనే సెన్సార్ కట్స్‌కు ఒప్పుకోలేదు. అందుకే ఏ సర్టిఫికెట్ వచ్చింది. అంతకు మించి సినిమాలో ఎలాంటి అసభ్య..అశ్లీలతతో కూడిన సన్నివేశాలు లేవు` అన్నారు. అలాగే సలార్ -2 ఎప్పుడు మొదలు పెడతారు? అన్న ప్రశ్న రెయిజ్ అవ్వగా దానికి క్లారిటీ ఇచ్చారు.
`రెండవ భాగం స్క్రిప్ట్ సిద్దమైంది. పార్ట్ వన్ చూసిన వారికి రెండవ భాగం ఉంటుందని అర్దమైపో తుంది. రెండు భాగాలు చూస్తేనే సలార్ సంపూర్ణం అవుతుంది. మొదటి భాగం రిలీజ్ అనంతరం ప్రశాంత్ నీల్ కొన్ని నెలలు విరామం తీసుకుంటారు. వచ్చే ఏడాదిలోనే పార్ట్ -2 షూటింగ్ ప్రారంభం అవుతుంది. అలాగే సినిమాలో హీరో యశ్ గెస్ట్ రోల్ ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.