'పీవీఆర్' పై సలార్ అభిమాని ఆగ్రహం!
18 ఏళ్లలోపు వ్యక్తులు థియేటర్‌లోకి ప్రవేశించి నప్పుడు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. థియేటర్ యాజమాన్యం పోలీసుల సహాయాన్ని కోరింది.
'సలార్' రిలీజ్ అయి నాలుగు రోజులు గడుస్తున్నా? ఇంకా థియేటర్ల వద్ద వేడి ఏమాత్రం తగ్గలేదు. థియే టర్ల వద్ద భారీ ఎత్తున ప్రేక్షకాభిమానులు కనిపిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ కొనసాగు తుంది. తెలుగు రాష్ట్రల్లో అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఆన్ లైన్ బుకింగ్స్ సైతం అంతే బిజీగా ఉన్నాయి. దీంతో థియేటర్లలలో షో ఆటంకం సైతం ఏర్పడుతుందని తెలుస్తోంది.
తాజాగా హైదరాబాద్ పీవీఆర్ మాల్ లో ఓ అభిమాని తన అసహనాన్ని వెల్లడించాడు. సలార్ 'ఏ' సర్టిఫికెట్ సినిమా అన్న సంగతి తెలిసిందే. సినిమాలో హింస...కృరత్వం..శృంగారం లాంటి కంటెంట్ ఉన్న సినిమా లకు సెన్సార్ ఏ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. 'సలార్' కి అలాంటి సర్టిఫికెట్ జారీ అయిన సంగతి తెలిసిందే. యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉండటంతో ఏ పట్టా తప్పలేదు. అయితే ఏ సర్టిఫికెట్ వస్తే 18 ఏళ్ల లోపు వయసు గల వారికి ప్రవేశం లేదు. ఆ పైబడిన వారే థియేటర్లోకి అనుమతించబడతారు.
మరి ఈ నిబంధన ఎంతవరకూ పాటిస్తున్నారు? అంటే రూల్స్ గాలికి వదిలినట్లే పీవీఆర్ ఏట్రియాం మాల్ లో చోటు చేసుకున్న సన్నివేశం బట్టి తెలుస్తోంది. 18 ఏళ్లలోపు వ్యక్తులు థియేటర్‌లోకి ప్రవేశించి నప్పుడు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. థియేటర్ యాజమాన్యం పోలీసుల సహాయాన్ని కోరింది. విసుగు చెందిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అతను ఇలా వ్రాశాడు.
'థియేటర్ లోకి వచ్చి 45 నిమిషాలైనా సినిమా ప్రారంభం అవ్వలేదు. హైదరాబాద్‌లోని PVR ఏట్రియంలో షో ప్రారంభం కాలేదు. 18 ఏళ్లలోపు వ్యక్తులు స్క్రీన్‌లోకి ప్రవేశించారని వారు వెళ్లే వరకు వారు ప్రారంభించ లేదు. వారిని ముందుగా ఎందకు నిరోధించడం లేదు. ఇది వారి బాధ్యత. యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పోలీసులతో సమస్యను పరిష్కరిస్తోందా?? మా సమయాన్ని వృధా చేసినందుకు మేము పరిహారం కోరుతున్నాం.పీవీఆర్ నిర్వహణ ప్రవేశ ద్వారం వద్ద ఈ పరిస్థితిని నివారించవచ్చు. కానీ అలా చేయలేదు. నిబంధనలు ప్రవేశం ద్వారా వద్ద ఎందుకు కచ్చితంగా పాటించడం లేదు. ఇలా వ్యవహరిం చిన యాజమాన్యంపై కఠినంగా వ్యవరించాలి' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.