సలార్ టార్గెట్ ఫిక్స్.. ప్రశాంత్ నీల్ బ్రాండ్ ఇది..!

ప్రశాంత్ నీల్ క్రేజ్.. ప్రభాస్ మాస్ మేనియా ఈ రెండు కలిసి సలార్ బిజినెస్ షేక్ చేస్తుందట.

Update: 2023-07-27 04:00 GMT

కె.జి.ఎఫ్ 1, 2 సినిమాల తో సత్తా చాటిన ప్రశాంత్ నీల్ ఆ రెండు సినిమాల తోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. యశ్ కి కూడా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ తెచ్చిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రభాస్ కి నేషనల్ లెవెల్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రశాంత్ నీల్ సలార్ తో మరోసారి ప్రభాస్ ఇండియా మొత్తం బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా అందుకు తగినట్టుగానే ఉంది.

సలార్ సినిమా ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. టీజర్ తో శాంపిల్ మాత్రమే చూపించిన ప్రశాంత్ నీల్ సినిమా లో ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎవరు సీట్లలో కూర్చోనివ్వకుండా ప్రశాంత్ నీల్ ఆ సీన్స్ ప్లాన్ చేశారట. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ క్రేజ్.. ప్రభాస్ మాస్ మేనియా ఈ రెండు కలిసి సలార్ బిజినెస్ షేక్ చేస్తుందట. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ 1000 కోట్ల దాకా టచ్ అయ్యిందని టాక్.

KGF 2 తో ప్రశాంత్ నీల్.. బాహుబలితో ప్రభాస్ ఈ ఇద్దరు 1000 కోట్ల మార్క్ దాటారు. ఇప్పుడు ఇద్దరు కలిసి మరో 1000 కోట్ల సినిమా చేస్తున్నారు. సలార్ కలెక్షన్స్ 1000 కోట్ల పైన టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా రెండు పార్ట్ లుగా వస్తుండగా సలార్ ప్రభాస్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేయబోతుంది. ప్రభాస్ సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ లో జవాన్ మొదటి వారం పాన్ ఇండియా రిలీజ్ అవుతుండగా మంత్ ఎండ్ ప్రభాస్ సునామి సృష్టించబోతున్నాడు.

ప్రభాస్ సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో డైరెక్టర్ పృధ్వి రాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నాడు. ప్రభాస్ వర్సెస్ పృథ్వీరాజ్ సలార్ ఫైట్స్ కి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారట. ఈ యాక్షన్ పార్ట్ మాస్ ఆడియన్స్ కి మెంటల్ ఎక్కించేలా ఉంటాయని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ సలార్ పార్ట్ 1 కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ ప్రభాస్ రేంజ్ ఓపెనింగ్స్ తెచ్చినా సినిమా వర్క్ అవుట్ కాలేదు. అందుకే సలార్ మీదే అన్ని హోప్స్ పెట్టుకున్నారు రెబల్ ఫ్యాన్స్.

Tags:    

Similar News