సలార్ 2లో ఆ విలనిజం నెక్స్ట్ లెవల్
డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 730 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 730 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నాన్ థీయాట్రికల్ ద్వారా కూడా నిర్మాతకి భారీగా ఆదాయం వచ్చింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే సాలిడ్ హిట్ సలార్ తో వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఒకే అనే టాక్ తో నడుస్తోంది.
ఇక సలార్ 2 శౌర్యంగ పర్వం మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రశాంత్ నీల్ సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాని మొదటి పార్ట్ కంటే మరింత బెటర్ గా చూపించాలని అనుకుంటున్నాడు. సలార్ 1లో వదిలేసిన చాలా ప్రశ్నలకి ఈ శౌర్యంగ పర్వంలో సమాధానాలు చెప్పబోతున్నాడు. అంటే కావాల్సినంత కంటెంట్ పార్ట్ 2లో ఉండబోతోందని అర్ధమవుతోంది.
సినిమాలో ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి పాత్రల మధ్యనే ప్రధాన సంఘర్షణ ఉంటుందని తెలుస్తోంది. ఖాన్సార్ కి పృథ్వీ రాజ్ నాయకుడు అయిన తర్వాత శౌర్యంగ వంశానికి చెందిన ప్రభాస్ ఏం చేయనున్నాడు. అసలు ఖాన్సార్ లో కుట్రలు, రాజకీయాలు ఎలా ఉంటాయనేది పార్ట్2లో చూపించచూపించబోతున్నారు. తాజాగా శ్రియారెడ్డి ఇంటర్వ్యూలో పార్ట్ లో తన పాత్ర మరింత బలంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసింది.
అసలు దేవా, వరదరాజ మన్నార్ మధ్య వైరం సృష్టించడానికి ఆమె ఎలాంటి వ్యూహాలు వేసింది పార్ట్ 2లో చూపించనున్నారంట. అలాగే శౌర్యంగ వంశానికి చెందిన బాబీ సింహా క్యారెక్టర్ కూడా పార్ట్ 2లో బలంగా ఉండే అవకాశం ఉంది. కావాల్సినంత కథ అయితే ఈ సీక్వెల్ లో చెప్పడానికి ఉంది.
దానిని ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా ప్రశాంత్ నీల్ ఎంత గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్ట్ 2 కథ మొత్తం ఖాన్సార్ రాజ్యంలోనే నడుస్తుందని శ్రియారెడ్డి తన ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేసింది. సలార్ లో తన విలనిజంతో భయపెట్టిన శ్రియారెడ్డి పార్ట్ 2లో ఎలాంటి విశ్వరూపం చూపిస్తుందనేది చూడాలి.