సలార్.. ఇంత సైలెన్స్ ఎందుకు
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రెండు భాగాలుగా సిద్ధమవుతున్న సలార్ సిరీస్ లో పార్ట్ వన్ ప్రస్తుతం థియేటర్లోకి రాబోతుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా సలార్. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రెండు భాగాలుగా సిద్ధమవుతున్న సలార్ సిరీస్ లో పార్ట్ వన్ ప్రస్తుతం థియేటర్లోకి రాబోతుంది.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న మూవీ కావడంతో ఈ అంచనాలు పీక్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే డిసెంబర్ 1న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అఫీషియల్ గా ప్రకటించింది.
అయితే సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీస్ లేకపోవడం గమనార్హం. ట్రైలర్ ని కూడా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేసి వదిలేయనున్నారంట. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టే ఆలోచన లేదని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే సినిమా కోసం కూడా ప్రమోషన్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ లేదని టాక్. డైరెక్ట్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది.
ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆటోమేటిక్ గా సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. నిజానికి చాలా రోజుల నుంచి సలార్ ట్రైలర్ కోసం ఇండియా మొత్తం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయితే సినిమాపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ట్రైలర్ కట్ తో హైప్ క్రియేట్ చేయడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది.
దర్శకుల సత్తా కూడా అందులో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్ బాగుంటే సినిమాకి పాజిటివ్ టాక్ స్టార్ట్ అయిపోతుంది. అదే ఆడియన్స్ ని థియేటర్స్ వరకు రప్పిస్తోంది. అలాగే సలార్ ట్రైలర్ ప్రేక్షకులకు సాలిడ్ గా రీచ్ అయ్యేవిధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరు స్నేహితులు బద్ధశత్రువులుగా మారడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ సినిమాలో కథాంశంలో ఉండబోతుందని తెలుస్తోంది.